జుట్టు రాలకుండా వుండాలి అంటే మీరు తినే ఆహారం లో ఇవి ఉండేలా చూసుకోండి

జుట్టు రాలడం చిన్న విషయం కాదు, సాధారణంగా జుట్టు రాలడం అనేది మనలో ఏదో సరిగా లేదు అని చెప్పడానికి, దాని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు అని సూచించే మొదటి సంకేతం. దీర్ఘకాలిక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, లేదా కొన్ని ఔషధాలు తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు రాలుతుంది. మన జుట్టు కు చేటు చేసే కారకాల గురించి తెలుసుకోవడం తో పాటు సులభమైన మార్గాల్లో జుట్టు ను ఎలా సంరక్షించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తినాల్సిన ఆహారం ఇదే:
ప్రోటీన్లు, విటమిన్ బి , ఐరన్, జింక్ వంటి ఖనిజాలు అధికంగా వుండే కొన్ని రకాల ఆహార పదార్థాలు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. అనొరెక్సియా ( Anorexia ) అంటే తక్కువ బరువు ఉండటం, బులిమియా ( Bulimia) అంటే అతిగా తినడం వంటి ఆహార రుగ్మతలకు ,జుట్టు రాలడానికి మధ్య బలమైన సంబంధం వుంటుంది . జుట్టు రాలడానికి ఆహారం లోని ఏ నిర్ధిష్ట అంశాలు కారణమౌతున్నాయో ఖచ్చితంగా తెలియకపోవచ్చు. కానీ ఉదాహరణ కు అధిక చెక్కర లు, సంతృప్తి కొవ్వు లు ఉన్న ఆహార పదార్థాలతో గుండె సంబంధిత వ్యాధులు రావడం మాత్రమే కాకుండా, మన కణాల్లో ఒత్తిడి, వాపు కలుగుతుంది. దీనితో మన శరీరం మరింత సున్నితంగా మారి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. వాటిలో జుట్టు రాలడం కూడా ఒకటి. ఈ కారణంగానే మార్కెట్లో లభించే అనేక రకాల రెమెడీలు, యాంటి ఇన్ఫ్లమేటరీ ప్రభావాలపై దృష్టి సారిస్తాయి . కాబట్టి .. చేపలు, వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటి యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఆహారానికి ప్రాధ్యనం ఇవ్వాలి. ఇన్ఫ్లమేషన్ కలిగించే ఆహారానికి దూరంగా వుండటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా వుండే తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, గింజలు, విత్తనాలు, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు .


జుట్టు రాలడానికి మరో కారణం ఒత్తిడి:
ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసల్ హార్మోన్లు పెరుగుతాయి. ఈ హార్మోన్ విడుదల ఎక్కువైనా , తక్కువైనా సమస్యలు వస్తాయి.రోజువారీ జీవితంలో ఒత్తిడి సాధారణం అయిపోయింది. ఈ ఒత్తిడి పరిస్థితులు సుధీర్ఘకాలం కొనసాగితే జుట్టు రాలడం సమస్య మొదలౌతుంది అడ్రినల్ గ్రంథి ( adrenal glands) నుంచి ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ హార్మోన్ కు జుట్టు రాలడానికి సంబంధం వుంటుంది. ఒత్తిడి తగ్గిపోగానే శరీరంలో ఈ హార్మోన్ల స్థాయిలు సాధరణానికి వస్తాయి. ఆహారం తో ఈ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించవచ్చు. అవకాడో , ఆలివ్ ఫిష్ , కొన్ని రకాల విత్తనాలు , ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు, పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు , వివిధ విటమిన్లు, ఖనిజాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కార్టీసల్ హార్మోన్ కు కళ్లెం వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


పులియబెట్టిన ఆహారాలు:
జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో పులియబెట్టిన ఆహారా పదార్థాలు మంచి ప్రభావాన్ని చూపుతాయని నిరూపితమైంది. ఇక్కడే మన పేగుల్లోని మైక్రోబయోట పాత్ర కీలకమైంది. మైక్రోబయోట అంటే మన జీర్ణ వ్యవస్థ లో నివసించే సూక్ష్మజీవుల సమోహం. మైక్రోబయోట కు మన ఆరోగ్యం, వ్యాధులకు సంబంధం వుంటుంది. మనం తీసుకునే పోషకాలతో మైక్రో బయోటా పరస్పర చర్య జరుపుతుంది.తినే ఆహారాన్ని బట్టి మన శరీరంలోని మైక్రోబయాట భిన్నంగా వుంటుంది.మన జీవక్రియ పోషకాలను శరీరం శోషించడం అనేది మైక్రాబయోట జనాభా పై ఆధారపడి ఉంటుంది. వీటి సంఖ్య ఆధారంగానే శరీరంలో వివిధ రసాయన జీవక్రియ సంకేతాలు ఉత్పత్తి అవుతాయి .ఇవి ఒత్తిడి నీ ఎదుర్కోవడంలో కూడా సహాయపడగలవు.మన ఆహారం వైవిద్యంగా వుంటే, పేగుల్లో బ్యాక్టీరియా కూడా అదేవిధంగా తయారౌతుంది. కాబట్టి యోగర్ట్ తో పాటు ఇతర పులియబెట్టిన వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు .ఇవి పాటిస్తే జుట్టు క్షేమంగా వుంటుంది

Previous Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *