‘పెళ్లి అంటే ఏంటీ?’ అంటూ సోషల్ స్టడీస్ పరీక్షలో 10 మార్కుల ప్రశ్న వచ్చింది. దానికి ఓ విద్యార్థి రాసిన జవాబు నవ్వులు పూయిస్తోంది.
ఇందుకు సంబంధించిన జవాబు పత్ర ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వేలు అనే నెటిజన్ ఈ ఫొటోను ట్విటర్ లో షేర్ చేశారు.
”నువ్విక పెద్దదానివి అయ్యావని అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు చెప్పిన సమయంలో పెళ్లి జరుగుతుంది. మేమిక నీకు తిండి పెట్టలేమని, నీకు తిండి పెట్టే వాడిని వెతుక్కోవాలని తల్లిదండ్రులు అమ్మాయికి చెబుతారు. మరోవైపు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయి వెంటపడుతుంటారు తల్లిదండ్రులు. నువ్వు పెద్దోడివి అయ్యావని అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు చెప్పిన సమయంలో పెళ్లి జరుగుతుంది. మేమిక నీకు తిండి పెట్టలేమని, నీకు తిండి పెట్టే వాడిని వెతుక్కోవాలని తల్లిదండ్రులు అమ్మాయికి చెబుతారు. మరోవైపు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయి వెంటపడుతుంటారు తల్లిదండ్రులు. నువ్వు పెద్దోడివి అయ్యావని చెబుతుంటారు. అప్పుడు ఆ అమ్మాయి, అబ్బాయి కలిసి సంతోషంగా జీవించాలని నిర్ణయం తీసుకుంటారు. పిల్లలను కనడానికి తప్పుడు పనులు చేయడం మొదలుపెడతారు” అని ఆ విద్యార్థి రాసుకొచ్చాడు. దీంతో అతడికి టీచర్ ‘సున్నా’ మార్కులు వేసినట్లు జవాబు పత్రంలో కనపడుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, సామాజిక మాధ్యమాల్లో ఆ జవాబు పత్రం బాగా వైరల్ అవుతోంది.