ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు కొంపముంచుతున్నాయి. అతనిపైన్నే కాదు కంపెనీ ఉద్యోగులతోపాటు ఇతర కంపెనీలపైనా ప్రభావం చూపుతున్నాయి. గత నెల చివరిలో మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
వెరిఫై చేయబడిన వినియోగదారులు శోధనలు, ప్రస్తావనలు మరియు ప్రత్యుత్తరాలు, పొడవైన ఆడియో మరియు వీడియో క్లిప్‌లు మరియు సగం కంటే ఎక్కువ ప్రకటనలను పోస్ట్ చేయగల సామర్థ్యం, ఇతర విషయాలలో ప్రాధాన్యత పొందుతారని చెప్పడం ద్వారా మస్క్ రుసుమును సమర్థించారు.
“ప్రజలకు అధికారం! నెలకు $8కి నీలి రంగు” అని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు, కొనుగోలు శక్తి సమానత్వానికి అనుగుణంగా దేశానికి అనుగుణంగా ధర సర్దుబాటు చేయబడుతుంది.
అప్పటి నుంచి ఇతర కంపెనీలు, ఉద్యోగులు ట్విట్టర్ స్టీరింగ్ ఎలన్ మస్క్ చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు మస్క్ ఉద్యోగులపై తన ప్రతాపం చూపించాడు. మస్క్ తీసుకున్న నిర్ణయాలు ఇతర కంపెనీలపై ప్రభావం చూపాయి. దీనికి కారణం ట్విట్టర్ వెరిఫికేషన్ సంబంధించిన మస్క్ తీసుకున్న నిర్ణయమే. నిజానికి మస్క్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను చెల్లింపు సబ్ స్క్రిప్షన్ ప్లాన్ రూపంలో అందించారు.
అయితే మస్క్ ప్రకటన తర్వాత ఐడెంటింటిఫై చేసిన అకౌంట్ల్స్ కు ట్విట్టర్ 8డాలర్లను వసూలు చేయడం ప్రారంభించింది. ఇది కొన్ని దేశాల్లో మాత్రమే ప్రారంభించింది. అయితే ప్రస్తుతం దీన్ని నిలిపివేశారు. అయితే ఈ బ్లూ టిక్ వల్ల ఓ కంపెనీ బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోయింది. దీనికి కారణంగా పెయిడ్ బ్లూ టిక్. మస్క్ ఎంట్రీకి ముందు ట్విట్టర్ లో బ్లూ టిక్స్ కోసం గుర్తింపు ఐడెంటింటి
ఉంది. ట్విట్టర్ వార్తను విశ్వసనీయ వార్తగా పరిగణించడానికి ఇదే కారణం. కానీ మస్క్ బ్లూ టిక్ ను మార్చేశాడు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే మస్క్ ఊహించలేదు. బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తో యూజర్లు మరింత భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఫేక్ వెరిఫైడ్ అకౌంట్ల గురించి సమాచారం వస్తూనే ఉంది. కొందరు 8డాలర్లు చెల్లించి బ్లూ టిక్స్ పొందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్, జీసస్ క్రైస్ట్ పేరుతో నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి బ్లూ టిక్స్ కొనుగోలు చేశారు.
అమెరికాకు చెందిన ఫార్మసీ కంపెనీ ఎలి లిల్లీ పేరుతో చేసిన ఫేక్ ట్వీట్ వల్ల ఆ కంపెనీకి వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఎలీ లిల్లీ పేరుతో ఎవరో అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇన్సులిన్ ఉచితం అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెరిఫైడ్ అకౌంట్ నుంచి చేసినందుకు ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఒక్క ట్వీట్ తో కంపెనీ దాదాపు 4.37శాతం షేర్లు పడిపోయాయి. వారి మార్కెట్ క్యాప్ సుమారు 1223 బిలియన్లు తగ్గింది. ఫేక్ ట్వీట్ గురించి తెలుసుకున్న వెంటనే కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. అప్పటికే కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది.