సింగిల్ కాల్ అంటూ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా చేస్తారు. ఇదోరకం కొత్త స్కామ్ దేశంలో చక్కర్లు కొడుతోంది. చాలా అవసరం అర్జెంటుగా కాల్ చేసుకోవాలి సింగిల్ కాల్ అంటూ?
అని అడుగుతారు. ఏముందిలే ఒక్క కాల్ కోసం కదా అడుగుతున్నారని మీ ఫోన్ ఇచ్చారో, మీ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా చేస్తారు. లేటెస్ట్ గా స్కామర్లు ఈ కొత్త టెక్నీక్ ఉపయోగిస్తున్నారు. దీనికోసం సింపుల్ గా ఒక నంబర్ కు డయల్ చేస్తే సరిపోతుంది. అసలు ఈ కొత్త టెక్నీక్ మరియు స్కామ్ గురించి తెలుసుకుంటే, ఇటువంటి స్కామర్ల నుండి జాగ్రత్తగా పడవచ్చు.
అసలు ఏమిటి ఈ కొత్త కాల్ స్కాం?
స్కామర్లు ప్రజల మంచితనాన్ని అదునుగా చేసుకొని ఈ కొత్త కాల్ స్కాం ను అదునుగా చేసుకున్నారు. ఇందులో, స్కామర్లు అత్యవసరం చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? అని అడుగుతారు. మీరు ఫోన్ ఇచ్చినట్లయితే వారు వెంటనే *21* లేదా *401* కి కాల్ చేస్తారు. అంతే, ఇక్కడ నుండి మీ ఫోన్ కాల్స్ మరియు మెసేజీలు వారి నంబర్ కి ఫార్వార్డ్ అవుతాయి.
పైన తెలిపి విధంగా మీ ఫోన్ మెసేజీలు మరియు కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ ఇంపార్టెంట్ మెసేజీలు మరియు కాల్స్ మరిన్ని వివరాలు స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఇంకేముంది మీ ఇన్ఫర్మేషన్ తో మీ జేబు ఖాళీ చేసేస్తారు.
మీ ఫోన్ లో ఇది ఎలా కనిపెట్టాలి?
మీకు తెలియకుండా మీ ఫోన్ లో ఎవరైనా కాల్ ఫార్వార్డింగ్ సెట్ చేశారో లేదో మీరు చాలా సులభంగా చెక్ చేయవచ్చు. దీనికోసం, మీ ఫోన్ నుండి *#62# లేదా *#67# నంబర్ కు డయల్ చేయగానే మీ ఫోన్ లో అన్ని వివరాలు చూడవచ్చు.
ఎలా నివారించాలి?
ఒకవేళ మీ ఫోన్ లో మీకు తెలియకుండా కాల్ ఫార్వార్డ్ సెట్ చేసినట్లయితే, మీరు చాలా సులభంగా దాన్ని తొలగించవచ్చు. దీనికోసం, మీ ఫోన్సెట్టింగ్స్లో కాల్ > కాల్ ఫార్వార్డింగ్లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్ అప్షన్ ను టర్న్ ఆఫ్చేయవచ్చు.