యువతా.. నీ దారెటు?

ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది ఆదేశంలో సహజ వనరులపైనే కాదు అక్కడ నెలకొన్న మానవ వనరులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మానవ వనరులంటే జనాభా. ఈ జనాభాలో విభిన్న వయోవర్గాల వారు ఉంటారు. వీరిలో ఉత్పాదకవర్గమైన యువ జనాభా కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచంలోనే అద్భుతమైన సహజ వనరులు మానవ వనరులున్న దేశం మనది. అంతకన్నా ముఖ్యంగా దేశ జనాభాలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. నేడు ప్రపంచంలో అభివృద్ధి విషయంలో అగ్రగామిగా ఉన్న దేశాలు కూడా ఆ దేశాల వయోవిభజనలో వృద్ధుల జనాభా పెరగడం చూసి కలవరపడుతున్నాయి. రానురానూ దేశంలో అనుత్పాదక జనాభా పెరుగుతూ ఉండటంతో ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈ విషయంలో అలాంటి పరిస్ధితి మన దేశానికి లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కానీ ఆ యువతను ప్రభుత్వాలు సరిగ్గా వినియోగించుకుంటున్నాయా? వారి నైపుణ్యం వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? అనేది ఇక్కడ కీలకంగా గుర్తించాల్సిన అంశం.
ఆలోచనా దృక్పథం
మనం ఏం ఆలోచిస్తామో ఆ విధంగానే తయారవుతాం. అందుకే మన ఆలోచనలు ధోరణిని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. అంటే మనకు మనమే సెల్ఫ్‌ చెక్‌ చేసుకోవాలి. మాటలు అనేవి తాత్కాలికమే. ఆలోచనలు మాత్రం శాశ్వతం. అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. ఆలోచనలు సానుకూలంగా ఉంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అదే ప్రతికూలంగా ఉంటే ప్రతికూల ఫలితాలే వస్తాయి. సానుకూల ఆలోచనలు మన హృదయాలలో ఆశను సృష్టిస్తాయి. అయితే భయం, కోపం, అసూయ, అహం వంటి ప్రతికూల భావాలు మన మనస్సులలో ఆందోళనను కలిగిస్తాయి. బాల్యంలో ఈ సానుకూలతకు ప్రతికూలతకు మధ్య పెద్ద బేధం తెలియదు.వృద్దాప్యంలో వైరాగ్యం దిశగా జీవితం నడక సాగిస్తుంది. కానీ యవ్వనంలో సానుకూల ఆలోచనలు యువతకు ఆయుధం కావాలి. ప్రతికూల ఆలోచనలు మూఢ నమ్మకాలు పట్ల ఆకర్షితులయ్యే యువత ఉన్న దేశం ఎన్నటికీ పురోగతి సాధించలేదు. జీవితంలో సానుకూల ఆలోచనలు ఉండాలి. ఈ ఆలోచనలు వ్యక్తిగతంగా యువతకే కాదు దేశానికి ఎంతో ప్రయోజనకరం. రాబోయే తరానికి వార సత్వంగా అందించే గొప్ప బహుమానం.నేటి యువతకు కళాశాల ల్లోనూ కార్యరంగంలోనూఎన్నో సమస్యలు, సవాళ్ళు ఎదురవుతు న్నాయి. వాటిని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవడానికి సానుకూలమైన ఆలోచన, సానుకూల భావాలు అత్యంత ఆవశ్యకం. ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథం లేకపోతే యువత విజయాన్ని సొంతం చేసుకోలేదు. జీవిత లక్ష్యాన్ని సాధించలేదు. జీవన యాత్రను అర్ధవంతంగా మలచుకోలేదు. అందుకే యువత ఆలోచనా దృక్పథం మారాలి.
కంపర్ట్‌ జోన్‌ ప్రగతికి అవరోధం
భద్రమైన జీవితాన్ని కోరుకునే వారు భవ్యమైన చరిత్రను మిగల్చలేరు. బతుకు సఫలం, సార్థకం కావాలంటే సవాళ్లకు సిద్ధమై ఉండాలి. నేటి యువతలో చాలా మంది వారిలో అంతర్గతంగా ప్రతిభా పాటవాలు ఉన్నప్పటికీ వాటిని మెరుగు పెట్టే దిశగా పరిశ్రమించడానికి కృషి చేయకుండా ఈ కంఫర్ట్‌ జోన్‌ లోనే ఉండి పోతున్నారు.ప్రశాంత జీవనం సాగించాలి అంటే రిస్క్‌ కు దూరంగా ఉండాలి సవాళ్ళను స్వీకరించకుండా కంఫర్ట్‌గా జీవించాలి అనే దృక్పధం కలిగిన యువత దేశానికి తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తుంది. ఉరుకులు పరుగులు పెట్టి సాధించేది ఏముంది జీవితాన్ని ఆస్వాదించాలి అంటూ యుక్త వయసులో ఒత్తిడులకు దూరంగా అనుభవిద్దాం అనే ధోరణి కలిగిన యువత నేటి సమాజంలో లేకపోలేదు. బద్దకానికి మరో పేరుగా చెప్పుకునే అనుభవిద్దాం అనే కంపర్ట్‌ జోన్‌ అనే పేరు పెట్టి తనను తాను మోసం చేసుకుంటూ వ్యవస్ధకు పరోక్షంగా హాని చేసే ప్రక్రియ నేడు కొంతమంది యువతలో కనిపిస్తూ ఉంది. ఇటువంటి వారికి జీవితంలో చిన్న సవాలు ఎదురైనా తట్టుకోలేరు. ఈ ధోరణి వీళ్లకే పరిమితం కాకుండా అది మరింత వ్యాప్తి చెందింతే యువతలో ఉద్యమిత్వ లక్షణాలు క్షీణించిపోతాయి. ఉద్యమిత్వం లోపించిన దేశం తీవ్రంగా నష్టపోతుంది. అందుకే పెద్దలు ‘జీవితంలో రిస్క్‌ తీసుకో… గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు.
సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం
ఓటమిని జీర్ణించుకోలేక చిన్న చిన్న పరాజయాలకే నిరాశకు గురై కృంగిపోయే యువతను నేడు అనేకమందిని చూస్తున్నాం. కొందరైతే ఓడిపోతాం అనే భయంతోనే ప్రయత్నించడం మానేస్తున్నారు. కొందరైతే లక్ష్యాన్ని మాత్రమే చూస్తూ ఆ భావాన్ని ఆస్వాదిస్తూ లక్ష్య సాధనలో మాత్రం దృష్టి పెట్టలేని వాళ్ళు ఉన్నారు. పోరాడుతూ మరణిస్తే గెలిచినట్లే.. పోరాడుతూ విరమిస్తే మరణించినట్లే అన్నారు పెద్దలు. ఇది అక్షర సత్యం. మనలో పేరుకు పోయిన భీతి మనలో అంతర్గతంగా నెలకొన్న ప్రతిభను నిర్వీర్యం చేస్తుంది. ఫలితం ఏమిటి అనేది పట్టించు కోకుండా పోరాటంలో దిగిన వారు విజేతలవుతున్నారు. ఒక వేళ ఓటమి ఎదురైనా దానిని అనుభవంగా తీసుకుని పోరాటం కొనసాగిస్తున్న వారు విజయాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. విజయాన్ని అందుకునే ముందు సహజంగా ఓటములు వెక్కిరి స్తూనే ఉంటాయి. ఆ ఓటముల నుంచే పాఠాలు నేర్చుకోవాలి. అనుకున్నది సాధించే లక్ష్యంలో ప్రతి ఓటమిని గెలుపునకు మెట్లుగా మలుచుకోవాలి. అందుకే ఓటమి కూడా గెలుపుగా చూసినప్పుడే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. మొదటి ప్రయత్నంలో గెలిచిన వారు కన్నా ఓడి గెలిచిన వారు ఆ విజయాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు. అటువంటి వాళ్ళు మరెందరికో మార్గదర్శకంగా నిలుస్తారు. నేడు దేశంలో కుంగుబాటు వల్లనే అనేక మంది యువత చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలను తీసుకుంటున్నారు.ఈ రోజు అత్యున్నత స్ధితిలో ఉన్న వాళ్ళు ఎన్నో వైఫల్యాలను ఎదురు చూసిన వారే.వైఫల్యాలు ఇచ్చిన అనుభవాలే ఎప్పటికి పటిష్టమైన భవిష్యత్‌ అందిస్తాయి.
ఆత్మవిశ్వాసం
ఉన్నత విద్యావంతులు అయిన యువత కూడా తన పట్ల తనకు విశ్వాసం సన్నగిల్లి భగవంతునిపై భారం వేసి కార్యాచరణను కొనసాగించే వారు లేకపోలేదు. ఇటువంటి వారు మేము ఆస్తికులమని సమర్ధించుకుంటారు. అయితే ఈ తరహా నైజాన్ని ఏనాడో గుర్తించిన వివేకానంద. తనపై తనకు నమ్మకం లేని వాడు ఆస్తికుడు కాదని నాస్తికుడని తనపై తనకు నమ్మకం ఉన్నవాడే ఆస్తికుడని పేర్కొన్నారు. ఆత్మ విశ్వాసం సడలిన యువత దేశంలో ఎంత ఉన్నప్పటికి అది నిష్ప్రయోజనమే. ఆత్మ విశ్వాసం సాధించాలి అంటే ప్రతి మనిషి తనకంటూ ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్య సాధన దిశగా నిరంతరం సాధన చేయాలి. లక్ష్యం భారీగా పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటే ఉపయోగం లేదు. అనుకున్న లక్ష్య సాధనలో అనేక వైఫల్యాలు వస్తాయి. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని జాతిని మేలుకొలిపే సందేశం ఇచ్చారు. ప్రధానంగా యువ తరంలో ఆత్మన్యూనతా భావాలను రూపుమాపి వారిలో ఆత్మ విశ్వాసాన్ని పొదుగొల్పి దిశా నిర్దేశం చేయగలిగిన నాడు యువత దేశానికి కీలకంగా మారుతుంది. అటువంటి వాతావరణాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వాలు కలుగ చేయాలి.
కేరీర్‌పై దృష్టి
నేటి ప్రపంచ యువత కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. టీనేజ్‌లోనే ఏ రంగంలో స్థిరపడాలి అనేది ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచన కూడా ఇదే. పిల్లలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అయితే వారిలో ఏ కొద్దిమంది మాత్రమే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా అనుకున్న కెరీర్లో స్థిరపడిన యువత డాలర్ల వేటలో పరాయి దేశానికి వలసపోతున్నారు. అయితే అధిక శాతం యువత అటువంటి మెరుగైన ఉపాధి అవకాశాలను అందుకోలేక పోతున్నారు. కారణం ఆయా రంగాల్లో నైపుణ్యాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహం కలిగిన యువతీయువకులు ఎందరో ఉన్నారు. వారిలో అధిక శాతం ఆర్ధికంగా తక్కువగా ఉన్న నేపథ్యం నుండి వచ్చిన వారే. వారికి నైపుణ్యాలను పెంపొందించే యంత్రాంగం అందు బాటులో లేదు. సరైన సదుపాయాలులేవు, ప్రోత్సాహం ప్రేరణ లేవు.ఫలితంగా నిరుద్యోగం, నిరాశా నిస్పృహలతో ఎందరో గ్రామీణ యువత నేడు నిరాశతో తల్లడిల్లుతున్నారు.నేటి అవాంఛనీయ పోటీ వాతావరణంలో యువత మార్కులు, ర్యాంకులు, కార్పొరేట్‌ ఉద్యోగాలు, ఐదారంకెల జీతాలు.. నేటి యువతలో అధిక భాగం వీటి చుట్టూనే తిరుగుతోంది. ఇదే జీవితానికి నిజమైన సక్సెస్‌ అంటూ నైతిక విలువలు సామాజిక స్పృహ లేకుండా జీవించే యువత నేడు కనిపిస్తుంది. కారణం వారికి జీవిత సాఫల్యం అనే దానికి సరైన నిర్వచనం తెలియక పోవడమే.
ర్జించాడు.
పీటీ ఉష
జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపు సంపాదించడానికి పరుగులు మొదలు పెట్టి ఇప్పటి వరకు 101 పతకాలు సాధించి లాస్‌ యాంగిల్స్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా ఉష రికార్డు సృష్టించింది.పద్మశ్రీ, అర్జున అవార్డులు కైవసం చేసుకుంది.
కల్పనా చావ్లా
అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర పుటల్లో నిలిచిన కల్పనాచావ్లా చరిత్రలో నిలిచింది. ఆకాశంలోనే కనుమరుగైనా ఆమె అందించిన స్ఫూర్తితో ఎంతో మంది భారతీయ యువతులు అంతరిక్ష విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అందుకుంటున్నారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *