మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి డబ్బును తప్పు నంబర్‌కి పంపారా

వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి.

యూపీఐ ట్రాన్సాక్షన్స్ :-ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మారుతూనే ఉంటుంది. గతంలో డబ్బులు వేరే వారికి పంపాలన్న, తీసుకోవాలన్న కూడా బాంకు లకు పోయి గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించేది. ఇలా బ్యాంక్ సేవలు ఏది పొందాలన్నా కానీ సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సి వచ్చేది. బ్యాంకుల వద్ద కస్టమర్ల రద్దీ వల్ల క్యూలోనే సమయం చాలా వృథా అయ్యేది. కానీ ఆధునిక టెక్నాలజీ వల్ల బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. డబ్బులు వేరేవారికి పంపాలన్న, బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలన్నా, వేరే వరి నుంచి మనం డబ్బులు తీసుకోవాలనుకున్న కూడా మన మొబైల్ లోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి.

అయితే టెక్నాలజీ మరింత అప్డేట్ అవుతుండడంతో స్మార్ట్ ఫోన్ నుంచి మన బ్యాంక్ లావాదేవిలను కొనసాగించగలుగుతున్నాం. గతంలో తక్కువ మంది మాత్రమే మొబైల్ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించేవారు. కానీ కరోనా వల్ల ఆన్ లైన్ బ్యాంకు సేవలను వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య బాగా పెరిగింది. దీంతో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే వంటి యూపీఐ యాప్ లను వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రతి డిజిటల్ ప్లాట్ ఫాంలో ఒక్కోదానికి యూపీఐ మోడ్ పేమెంట్ సొంత పరిమితులు ఉంటాయి. అంటే రోజుకు ఎంత వరకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు అనే లిమిట్ ఉంటుంది.

సాధారణంగా అన్ని యూపీఐ యాప్స్ ద్వారా ఒక రోజులో లక్షకు పైగా మనీ ట్రాన్స్ ఫర్ చేయలేము. అలానే ఒక రోజులో 10 కంటే ఎక్కువ సార్లు మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి కుదరదు. వీటితో పాటే ఎవరి నుంచైనా రూ.2 వేల కంటే ఎక్కువ అమౌంట్ ను రిక్వెస్ట్ కోసం ట్రై చేసిన ఆ లావాదేవీ ఫెయిల్ అవుతుంది. ఒకవేళ మీ డెయిలీ మనీ ట్రాన్స్ ఫర్ లిమిట్ దాటితే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిన్నమొత్తంలో గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపేందుకు రిక్వెస్ట్ పంపుకోవచ్చు. అయితే వీటి వల్ల లాభాలు ఉన్నప్పటికి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా.

ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా ఆన్లైన్ లోనే బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటున్నాం. కానీ ఈ తరుణంలోనే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ పైన డిస్కౌంట్ లు ఇస్తాం, ఆన్లైన్ లో డబ్బులు పంపండి అంటూ మోసాలకు పాల్పడుతూ ఉంటారు. అలానే సైబర్ నేరగాళ్ల ద్వారానే కాకుండా ఒక్కోసారి మన తప్పిదాల వల్ల కూడా మనకి నష్టం వాటిల్లుతుంది. వాటిలో ముఖ్యంగా వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *