మీ ప్రియురాలితో విడిపోయారా? మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నారా? అయితే, 6 టిప్స్ మీకోసమే!

మీ ప్రియురాలితో విడిపోయారా? మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నారా? అయితే, 6 టిప్స్ మీకోసమే!

బంధాలు చాలా సున్నితమైనవి. ఆ బంధాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్క క్షణంలో ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రేమ విషయానికి వస్తే.. ఆ బంధాలను కలకాలం కొనసాగించడం కత్తిమీద సాము లాంటిది. ప్రేమంటే ముద్దులు, ముచ్చట్లే కాదు. ప్రేమలో అలకలు, కోపాలు, తాపాలు కూడా ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, మంచి కమ్యూనికేషన్‌తో ముందుకెళితే.. మరింత హ్యాపీగా లవ్ లైఫ్ సాగుతుంది. ప్రేమకులకు అహం, గర్వం ఉంటే సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగవు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా ఆ అహం, గర్వం దాన్ని కప్పేస్తుంది. ప్రేమికులిద్దరినీ దూరం చేస్తుంది. ఒక మీరు మీ కోపం, అహం, గర్వం కారణంగా మీ ప్రేయసిని వీడిపోయినట్లయితే, మళ్లీ వారితో మింగిల్ అవ్వాలనుకుంటే.. ఒక పని చేయాల్సి ఉంటుంది. మీరు నిజంగా మీ ప్రేయసిని ప్రేమిస్తున్నట్లయితే వారి కోసం ఈ ఆరు టిప్స్ పాటిస్తే.. మళ్లీ మీరిద్దరూ హ్యాపీగా కలిసి ఉండొచ్చు. మరి ఆ ఆరు టిప్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గులాబీ పువ్వులు తీసుకెళ్లండి:

ఎర్ర గులాబీల గుత్తితో వారి వద్దకు వెళ్లండి. జరిగిన పోరపాటను, విషయాన్ని వారికి వివరించండి. పొరపాటు జరిగిందని వారిని కన్వీన్స్ చేయండి. పూల బొకేతో మీరు నిజాయితీగా వారి ముందు నిల్చుంటే.. కశ్చితంగా వారి మనసు మారుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్లీ మీతో కలిసిపోతారు.

చాక్లెట్ ఇచ్చి క్షమించమని కోరండి:

చాక్లెట్‌.. హ్యాపీ పెంచే ప్రత్యేక పరిస్థితిని కల్పిస్తుంది. మీరు మీ క్షమాపణ లేఖతో పాటు.. చాక్లెట్ బాక్స్‌ను వారికి బహుమతిగా ఇవ్వండి. అలా చేస్తే వారంటే మీకు నిజమైన ప్రేమ ఉందని, వారీతో బంధాన్ని తేలికగా తీసుకోలేదని గుర్తిస్తారు.

ఒక పాటతో చెప్పండి:

చాలా మంది తమ ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి ‘పాట’ ను ఎంచుకుంటారు. తమ స్వీయ గొంతులో పాట పాడి వారిని ఇంప్రెస్ చేస్తారు. స్వీయ గొంతుతో ప్రేయసిని ఇంప్రెస్ చేయడం అద్భుతమైన చర్య. అలా చేయడం ద్వారా ఎదుటి వారిలో ఆ గొంతు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు కూడా మీ ప్రేయసితో ఇలా చేయండి. వారు లేకుంటే మీరు లేరనే భావన కలిగేలా ఓ పాటతో మీ భావాన్ని వ్యక్తీకరించండి.

లేఖ ద్వారా:

కొందరు వ్యక్తులు మాటలతో అన్నీ చెప్పలేరు. లేఖల ద్వారా తమలో భావాన్ని చక్కగా వ్యక్తపరిచే అద్భుతమైన శైలి వారిలో ఉంటుంది. అందుకే మీ భావాలను వ్యక్తపరుస్తూ లేఖ రాసి మీ ప్రేయసికి నేరుగా ఇవ్వండి. మీ మాటల్లో నిజాయితీ ఉంటే.. వారు ఖచ్చితంగా అర్తం చేసుకుని రియలైజ్ అవుతారు.

బాటిల్ సందేశం:

బాటిల్ మెసేజ్. ఇదొక వినూత్న ప్రయోం. ప్రేమ లేఖలు, రహస్య సందేశాలు పంపడానికి బాటిల్ సందేశం సరైన ఎంపిక అంటారు ప్రేమికులు. ఇది చూడటానికి ఫ్యాన్సీగా ఉంటుంది. అలాగే అది అందుకున్న మీ ప్రేయసి ప్పటికీ తన వద్దే దాచిపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

 

పార్టీ ఇవ్వడం ద్వారా:

ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయండి. అయితే, అది మీ ఇద్దరి కోసం మాత్రమే. వారిని కలిసి నేరుగా మాట్లాడటానికి ఇది ఉపకరిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవడానికి వారితో ఓపెన్‌గా మాట్లాడండి. వారిని కన్వీన్స్ చేయండి. అందుకోసం మంచి పార్టీ ప్లాన్ చేయండి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *