రైల్వే ప్రయాణీకులకు సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే (SECR) కీలక అప్డేట్ జారీ చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా మరికొన్ని రైళ్ల గమ్యాలు కుదించినట్లు తెలిపింది. లఖోలి – రాయపూర్ స్టేషన్ల మధ్య రెండో..
రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 08528 నంబర్ కలిగిన విశాఖ – రాయపూర్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 6 నుంచి 12 వరకు, రాయపూర్ – విశాఖ 08527 ను మహాసముండ – రాయపూర్ – మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని కోరారు.
రద్దు చేసిన రైళ్లతో పాటు పలు రైళ్ల గమ్య స్థానాలు, రూట్లు మార్పు చేశారు. తిరుపతి-బిలాస్పూర్ 17482 రైలు ఈ నెల 8, 11 తేదీల్లో టిట్లాఘర్, సంబల్ పూర్, జార్సుగూడ మధ్య దారి మళ్లించారు. వీటితో పాటు బిలాస్పూర్-తిరుపతి 17481 రైలు, పూరీ-అహ్మదాబాద్12843, అహ్మదాబాద్-పూరీ 12844 రైళ్లు కూడా ఇదే మార్గంలో నడవనున్నాయి. 8, 15 తేదీల్లో 12897 నంబర్ గల విశాఖ – నిజాముద్దీన్ సమతా ఎక్స్ప్రెస్ 2 గంటలు, 12న హజ్రత్ నిజాముద్దీన్ – విశాఖ 12808 రైలు 5 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. 15 న తిరుపతి – బిలాస్పూర్ 4 గంటలు, విశాఖ-భగత్ కీ- కోఠి 5 గంటలు ఆలస్యంగా బయలు దేరనున్నాయి.