ఇకపై మొబైల్ నెంబర్ అవసరం లేకుండానే టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు..

ఇకపై మొబైల్ నెంబర్ అవసరం లేకుండానే టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేసుకోవచ్చు..

ప్రపంచ ప్రఖ్యాత ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ అయిన టెలిగ్రామ్, అనేక కొత్త ఫీచర్లతో కూడిన అప్ డేట్ ను విడుదల చేసింది. దీనిలో భాగంగా ఇప్పుడు వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ లో సైన్ అప్ చేయడానికి ఎటువంటి ఫోన్ నంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం లేదు.

గతంలో టెలిగ్రామ్ వినియోగదారులు టెలిగ్రామ్ ఖాతాను క్రియేట్ చేయడానికి వారి మొబైల్ నంబర్ ను నమోదు చేయాల్సి ఉండేది. దీనితో పాటు కొత్త చాట్ ల కోసం ఆటోమేటిక్ మెస్సేజ్ డిలీషన్ ఆప్షన్ ను కూడా అప్ డేట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కోసం టాపిక్స్ 2.0 ఫీచర్ ను కూడా తీసుకొచ్చింది. టెలిగ్రామ్ ప్రకారం, తాజా అప్ డేట్ తో వినియోగదారులు ఇప్పుడు ఫ్రాగ్మెంట్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్న బ్లాక్ చైన్ ఆధారిత అనానిమస్ నంబర్లను ఉపయోగించి తమ ఖాతాను సైన్ అప్ చేసుకోవచ్చు. గతంలో టెలిగ్రామ్ వినియోగదారులు వారి ఫోన్ నంబర్ ని ఉపయోగించి సైన్ అప్ అవ్వాల్సి ఉండేది, ఈ ప్రక్రియ కోసం ఇప్పటికి సిమ్ కార్డ్ ను వినియోగించాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ 2013 సంవత్సరంలో సెల్ఫ్ డిస్స్ట్రక్షన్ మెస్సేజ్ లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు రెండు వైపులా పంపే లేదా స్వీకరించే మెస్సేజ్ లను డిలీట్ చేయవచ్చు.

అనంతరం వ్యక్తిగత చాట్లను క్లియర్ చేయడానికి వినియోగదారులు ఆటో డిలీట్ టైమర్లను కూడా సెటప్ చేసుకోవచ్చునని టెలిగ్రామ్ తెలిపింది. ఇకపై మీరు అన్ని కొత్త చాట్ లలోని మెస్సేజ్ లను ఆటోమేటిక్ గా తొలగించడానికి మీరు ఇప్పుడు గ్లోబల్ ఆటో డిలీట్ టైమర్ ను సెట్ చేసుకోవచ్చునని, దీని కోసం యాప్ ని ఓపెన్ చేసిన అందులో సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి, అందులో ప్రైవసీ & సెక్యూరిటీ ఆప్షన్ పై క్లిక్ చేసి, అందులో ఆటో డిలీట్ మెస్సేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని ఎనేబుల్ చేయవచ్చునని టెలిగ్రామ్ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. దీనితో పాటు టెలిగ్రామ్ 100 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న గ్రూప్ ల కోసం టాపిక్స్ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది వినియోగదారులు నేరుగా లేటెస్ట్ టాపిక్ కు మారడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడానికి అనుమతిస్తుంది.

టెలిగ్రామ్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి. టెలిగ్రామ్ కు దేశంలో 120 మిలియన్లకు పైగా ప్రీమియం వినియోగదారులు ఉన్నారు. ఇటీవల టెలిగ్రామ్ దేశంలోని ప్రీమియం వినియోగదారుల నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఫీజును తగ్గించింది. కంపెనీ సబ్ స్క్రిప్షన్ ధరను రూ. 469 నుంచి రూ. 179 కు తగ్గించింది. దేశంలో ప్రీమియం వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశంతో టెలిగ్రామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *