ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ కార్డుతో రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా.వివరాలు;
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) చెందిన క్రెడిట్ కార్డ్ విభాగం అయిన ఎస్బీఐ కార్డ్ నుంచి ఇటీవల తొలిసారిగా క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్ (Cashback SBI Card) లాంఛ్ అయిన సంగతి తెలిసిందే.
* ఆన్లైన్లో జరిపే లావాదేవీలపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దసరా, దీపావళి సేల్స్‌లో ఈ కార్డుతో అనేక బెనిఫిట్స్ పొందొచ్చు.
ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరిపేవారిని టార్గెట్‌గా చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ (Credit Card) రూపొందించడం విశేషం. ఒకే క్రెడిట్ కార్డుతో అన్ని వర్గాల కస్టమర్లను టార్గెట్ చేస్తోంది ఎస్బీఐ కార్డ్. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సులువుగా, సులభంగా ఈ క్రెడిట్ కార్డుల్ని జారీ చేయనుంది. టియర్ 2, టియర్ 3 పట్టణాల్లోని వినియోగదారులు తమ ఇంటి నుంచే సులువుగా క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్ పొందొచ్చు. ఇందుకోసం ఎస్బీఐ కార్డ్ స్ప్రింట్ డిజిటల్ అప్లికేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది.
* క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్ బెనిఫిట్స్ చూస్తే స్పెషల్ ఆఫర్లో భాగంగా 2023 మార్చి లోగా క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్ తీసుకునేవారికి ఈ క్రెడిట్ కార్డ్ మొదటి ఏడాది ఉచితం. క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డుతో జరిపే అన్ని లావాదేవీలపై 1 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇక ఆన్లైన్లో జరిపే లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
*మంత్లీ స్టేట్మెంట్ సైకిల్లో గరిష్టంగా రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంటే ఒక నెలలో రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లో ఆటోమెటిక్‌గా క్రెడిట్ అవుతుంది. ఇంటి అద్దె చెల్లింపు, ఫ్యూయెల్ కొనుగోలు, వ్యాలెట్‌లో డబ్బులు జమ చేయడం, మర్చెంట్ ఈఎంఐ, క్యాష్ అడ్వాన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఎన్‌క్యాష్, ఫ్లెక్సీపే లాంటివాటిపై క్యాష్‌బ్యాక్ లభించదు.
*క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్ ఇతర బెనిఫిట్స్ చూస్తే ఏడాదిలో నాలుగు సార్లు అంటే మూడు నెలలకు ఓసారి కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ చేయొచ్చు. ఫ్యూయల్ కొనుగోళ్లపై 1 శాతం సర్‌ఛార్జీ వేవర్ లభిస్తుంది. రూ.500 నుంచి రూ.3,000 వరకు లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. ఒక బిల్లింగ్ స్టేట్మెంట్లో గరిష్టంగా రూ.100 సర్‌ఛార్జీ మినహాయింపు.
*క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్ యాన్యువల్ రెన్యువల్ ఫీజు రూ.999. పన్నులు అదనం. మెంబర్షిప్ ఇయర్లో రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు వెనక్కి వస్తుంది. క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డ్ వీసా ప్లాట్‌ఫామ్‌పై లభిస్తుంది. 2023 మార్చి లోగా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే జాయినింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
*ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దసరా సేల్, అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతున్నాయి. దీపావళి వరకు సేల్స్ కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసేవారు క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డుతో ప్రయోజనాలు పొందొచ్చు.