కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ 4 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

విజయదశమి పర్వదినం సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు శుభవార్తలను అందించింది. అందులో ఒకటి.. ప్రధానమంత్రి గ్రామీణ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ని మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలోనే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో లభించడమే కాకుండా..జూలై నుంచి వర్తించనుంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బు లభించనుంది.

ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం లభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ మొత్తం 38 శాతానికి చేరనుంది. ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం మేర డీఏ పెంచింది. దీంతో మూల వేతనంలో డీఏ 34 శాతానికి చేరింది. తాజా పెంపు నిర్ణయంతో అది 38 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు

బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచడం ఈ ఏడాది ఇది రెండోసారి. అంతకుముందు మార్చిలో, కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచింది. మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీఏను 31% నుంచి 34%కి పెంచారు. ఉద్యోగుల జీతాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. ఇది ఉద్యోగులు, పెన్షనర్లు ఇద్దరికీ వర్తిస్తుంది.

: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో లభించడమే కాకుండా..జూలై నుంచి వర్తించనుంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా డబ్బు లభించనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం కోసం నిరీక్షణ ముగిసిపోనుంది. ప్రభుత్వం త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడించనుంది. డీఏ ఎప్పట్నించి ఇస్తారో తేదీ ఖరారైంది. జీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం..కరవు భత్యం డీఏను సెప్టెంబర్ 28న ప్రకటించనున్నారు. సెప్టెంబర్ జీతంలో రెండు నెలల ఏరియర్స్‌తో పాటు అంటే జూలై, ఆగస్టు డీఏ ఏరియర్స్‌తో పాటు లభించనుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *