లంబోర్గిని సూపర్ ఎస్‌యూవీ కార్.. ధర తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే ?
ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ మార్కెట్ లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఈ లంబోర్గినీ లగ్జరి కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా లంబోర్గిని కార్ల వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో లంబోర్గిని కార్ల తయారీ సంస్థ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తూ కస్టమర్ ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా లంబోర్గిని సంస్థ భారత మార్కెట్ లోకి ఊరూస్ పెర్ఫార్మెంటే ఎస్‌యూవీ కార్ ని పరిచయం చేసింది.
ఇండియాలో దీని ప్రారంభ ధర రూ.4.22 కోట్లు ఎక్స్‌షోరూంగా ఉంది. కాగా తాజాగా విడుదల చేసిన ఈ కారు స్టాండర్ట్ ఎస్యూవీ కంటే దాదాపు రూ. 1.12 కోట్లు అధికం. ఈ కారును అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేయగా,తాజాగా గురువారం రోజున ఈ కారుని ఇండియాలోకి తీసుకొచ్చింది లంబోర్ఘిని సంస్థ. ఈ కారు ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్యూవీ Urus Performante అని లంబోర్ఘిని చెబుతోంది. ఈ కొత్త మోడల్ డిజైన్, ఇంటీరియర్ రిచ్ లుక్‌ను ఇస్తాయి. ఫ్రంట్ బంపర్, కార్బన్ ఫైబర్ స్ప్లిట్టర్, బ్లాకడ్ ఔట్ ఎయిర్ ఇంటేక్ వెంట్స్ సరికొత్తగా కనిపిస్తున్నాయి.
ఫ్రంట్, రేర్ వీల్స్‌ని 16ఎంఎం వెడల్పుగా చేసింది లంబోర్ఘిని. ఎత్తును 20ఎంఎం పెంచింది. రేర్ బంపర్‌ని కూడా రీడిజైన్ చేసింది లంబోర్ఘిని. ఈ కారు గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్ లో బ్రాండ్ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్ లను తెరవడంలో ఊరూస్ కీలకపాత్ర పోషించిందని లంబోర్గినీ ఇండియా హెడ్ అగర్వాల్ తాజాగా వెల్లడించారు.