పొడవాటి జడ అమ్మాయిలకు ఎంతో ఇష్టం. కొందరికి ఆ పొడవు జడ కల. కానీ ఏమి చేసినా జుట్టు పెరగదు, మందం అవదు. ఎక్కడ వేసిన గొంగళి ఆక్కడున్నట్టు ఉంటుంది. అంతేనా జుట్టు చివర్లు చిట్లిపోవడం, పలుచగా మారిపోయి జుట్టు మాడు పాచెస్ గా బయటకు కనిపించడం, వీటన్నింటినీ అధిగమించాలనే ఉద్దేశ్యంతో మార్కెట్ లో వచ్చే ప్రతి కొత్త ఉత్పత్తిని ఉపయోగించడం.
ఇలా ప్రయోగాలు చేయడం వల్ల జుట్టుకు మరింత నష్టమే కానీ ఎలాంటి ఫలితం ఉండదు అనే విషయం మొదట తెలుసుకోవాలి. జుట్టును కాపాడుకోవడానికి ఖరీదైన ఉత్పత్తులు వాడి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం కాదు. సమయాన్ని కేటాయించాలి. అన్ని నిమిషాల్లో జరిగిపోవాలంటే ఎలా?? అందుకే కాస్త ఓపిక తెచ్చుకుని కింది టిప్స్ పాటిస్తే జుట్టును ఎంతో దృఢంగా పొడవుగా మార్చుకోవచ్చు.
అందమైన జుట్టు కోసం అరటిపండు, ఆలివ్ నూనె అరటిపండు, ఆలివ్ నూనెతో మాస్క్ తయారు చేసుకోండి. ఇక దీన్ని తయారు చేయడానికి ఒక అరటిపండును మిక్సీలో తీసుకుని..
ఒక చెంచా ఆలివ్ ఆయిల్, రెండు చెంచాల పెరుగు కలపండి. దీని తర్వాత రెండు మూడు చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ఇది మీ జుట్టును సిల్కీ స్మూత్‌గా మార్చుతుంది.ఇంకా అలాగే రెండు చెంచాల కండీషనర్ తీసుకుని, ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా గ్లిజరిన్ వేసి, మూడింట ఒక వంతు వెనిగర్ వేసి కలపాలి. ఈ మాస్క్‌ని జుట్టు, మూలాలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి. ఇది పొడి, చీలిపోయిన జుట్టును నయం చేస్తుంది
హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఈ మాస్క్ ఉపయోగించండి. ఇందుకోసం రెండు స్పూన్లు లేదా రెండు బ్యాగుల గ్రీన్ టీని వేడి నీటిలో వేసి మూతపెట్టి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నీరు చల్లారిన తర్వాత దానితో తలకు మసాజ్ చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు సాధారణ నీటితో తల కడగండి.గుడ్డు చాలా మంచి హెయిర్ ప్యాక్ అని చెప్పవచ్చు. దీన్ని స్పా ట్రీట్‌మెంట్‌గా ఉపయోగించడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే మీ జుట్టు పొడవును బట్టి గుడ్లు తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, తేనె కలపండి. బ్రష్ సహాయంతో దీన్ని అప్లై చేయండి. 20 నుంచి 25 నిమిషాలు అప్లై చేసి.. ఆపై షాంపూ చేయండి.అలాగే కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీ జుట్టు పొడవును బట్టి తాజా కొబ్బరి పాలను తీసుకుని.. దానితో మీ జుట్టుకు మసాజ్ చేయండి. ఇప్పుడు టవల్ తీసుకుని తలకు కట్టుకుని అరగంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.
.గ్రీన్ టీలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇది జుట్టుకు చాలా మంచిది.
.గ్రీన్ టీలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇది జుట్టుకు చాలా మంచిది.