మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు చాలామంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏదైనా వస్తువు ఎక్కడైనా పెడితే కొద్దిసేపటి తర్వాత అది ఎక్కడ పెట్టామో కూడా తెలియక ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు.

ఇంకొందరు అయితే చాలా సేపు ఆలోచించిన తర్వాత గుర్తుకు వచ్చి మళ్లీ ఆ వస్తువును తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు. అలా చాలావరకు మతిమరుపు సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. మతిమరుపు మానవ జీవన శైలి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇదివరకు రోజుల్లో కేవలం మతిమరుపు సమస్య అన్నది వయసు మీద పడిన వారికి మాత్రమే కనిపించేది. కానీ రానులను ఈ సమస్య చిన్న పిల్లల నుంచి మొదలైంది. నేటితరం యువత జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లేక వెనుకబడిపోవడం మాత్రమే కాకుండా చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతున్నారు.

మరి మతిమరుపు సమస్య తగ్గించుకొని జ్ఞాపక శక్తిని పెంచుకునే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్రహ్మి అనేది ఒక మూలిక. ఈ మూలిక ఔషద లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మూలికను వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూనే ఉన్నారు. బ్రహ్మి మెదడు పనితీరును ప్రోత్సహించి,ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రాహ్మిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. శంఖపుష్పి మూలికలు ఆయుర్వేద వైద్యంలో వీటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది మనస్సును శాంతపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో బాగాఉపయోగపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పనిచేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో టీస్పూన్ ఈ పొడిని కలిపి తీసుకోవాలి.

అశ్వగంధ వీటిని కొన్ని వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఒక మంచి ఔషధంగా వినియోగిస్తూనే ఉన్నారు. ఇది శారీరక అలాగే మానసిక రుగ్మతలను తగ్గిస్తుంది. అశ్వగంధ జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధ ని నెయ్యి, పాలు నీరు తేనెతో కలిపి తీసుకోవచ్చు. తులసి ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. తులసి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. తులసి ఆకులు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెంచడం మాత్రమే కాకుండా మతిమరుపు సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు 5 లేదా 10 తులసి ఆకులు,5 బాదం,5 నల్ల మిరియాలు తేనెతో కలిపి తీసుకోవచ్చు.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *