భారతదేశంలోనే అతిపెద్ద బీమా రంగ దిగ్గజం అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలిసారిగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది.
పాలసీహోల్డర్స్‌కు వాట్సప్ సేవల్ని ప్రారంభిస్తున్నామని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. ఎల్ఐసీ పాలసీదారులు కంపెనీ అందిస్తున్న సేవల్ని వాట్సప్ ద్వారా పొందొచ్చు. ఇందుకోసం 8976862090 మొబైల్ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు. ప్రస్తుతం ఓ 10 సేవల్ని మాత్రమే వాట్సప్ ద్వారా అందిస్తోంది ఎల్ఐసీ. ఆ 10 సేవలు ఏవో తెలుసుకోండి.
వాట్సప్‌లో ఎల్ఐసీ అందిస్తున్న 10 సేవలివే…
ప్రీమియం డ్యూ
బోనస్ సమాచారం
పాలసీ స్టేటస్
లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్
లోన్ రీపేమెంట్ కొటేషన్
రుణ వడ్డీ బకాయి
ప్రీమియం చెల్లించిన సర్టిఫికెట్
యూఎల్ల్ఐపి – యూనిట్స్ స్టేట్‌మెంట్
ఎల్ఐసి సేవల లింక్స్
సేవలను ప్రారంభించడం, నిలిపివేయడం
ఈ 10 సేవల్ని పాలసీదారులు తమ వాట్సప్‌లో పొందొచ్చు. అయితే ఎల్ఐసీ పోర్టల్‌లో పాలసీలు రిజిస్టర్ చేసుకున్నవారికి మాత్రమే వాట్సప్ సేవలు అందుబాటులో ఉంటాయి. మరి ఎల్ఐసీ పోర్టల్‌లో మీ పాలసీలను రిజిస్టర్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా మీవి, మీ కుటుంబ సభ్యుల పాలసీ నెంబర్లు, ప్రీమియం చెల్లించిన రిసిప్ట్స్, పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ లాంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఎల్ఐసీ పోర్టల్‌లో పాలసీలను ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా డబ్ల్యూ. డబ్ల్యూ.డబ్ల్యూ.ఎల్ఐసిఇండియా .ఇన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- ఆ తర్వాత కస్టమర్ పోర్టల్ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 3- న్యూ యూసర్ పైన క్లిక్ చేయాలి.
Step 4- యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
Step 5- మీ యూజర్ ఐడీ జనరేట్ అయిన తర్వాత లాగిన్ కావాలి.
Step 6- లాగిన్ అయ్యాక బేసిక్ సర్వీసెస్లఆడ్ పాలసీపైన క్లిక్ చేయాలి.
Step 7- ఇలా మీ ఎల్ఐసీ పాలసీలన్నీ యాడ్ చేయాలి.
ఎ ల్ఐసీ పోర్టల్‌లో మీ పాలసీలను యాడ్ చేసిన తర్వాత వాట్సప్ ద్వారా ఎల్ఐసీ అందిస్తున్న సేవల్ని పొందొచ్చు. ఎల్ఐసీ పోర్టల్‌లో మీరు లాగిన్ కావడానికి ఉపయోగించిన మొబైల్ నెంబర్‌తోనే వాట్సప్ సేవల్ని పొందొచ్చు. ఎల్ఐసీ పోర్టల్‌లో మీ పాలసీలు యాడ్ చేసిన తర్వాత ఈ స్టెప్స్ ఫాలో అవండి.
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో 8976862090 నెంబర్ సేవ్ చేయండి.
ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి ఇదే నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ టైప్ చేస్తే ఈ కింద ఉన్నట్టుగా మెసేజ్ వస్తుంది.