మెస్మరైజ్ ఆఫర్.. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.87 వేల తగ్గింపు.. ఒక్క రోజే ఛాన్స్

మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

అయితే మీకు శుభవార్త. మీకోసం అదిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రీమియం ఫోన్లపై ఇంకా ఎక్కువ తగ్గింపు పొందొచ్చు.

దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ అక్టోబర్ 23 వరకే ఉంటుంది. తర్వాత అందుబాటులో ఉండదు. అంటే ఆఫర్లు రేపు ఒక్క రోజే ఉంటాయి.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ ఫోన్‌పై (12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ) ఏకంగా రూ. 87 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు రేటు రూ. 1,71,999. అయితే దీన్ని సేల్‌లో భాగంగా రూ. 1,19,999కు కొనొచ్చు. అంటే 30 శాతం తగ్గింపు లభిస్తోంది

అలాగే బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అప్పుడు ఫోన్ ధర రూ. 1,09,999కు దిగి వస్తుంది. ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ పొందొచ్చు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 25 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఫోన్‌ను రూ. 84,999కు కొనుగోలు చేయొచ్చు. అంటే మొత్తంగా ఫోన్‌పై ఏకంగా రూ. 87 వేల వరకు తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ ప్రాతిపదికన మారుతుంది. అలాగే ఫోన్ ఎలా ఉందనే అంశంపై కూడా ఎక్స్చేంజ్ విలువ మారుతుంది. అందువల్ల మీ ఫోన్‌కు తక్కువ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా రావొచ్చు.

మీకు ఈఎంఐలో కూడా ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా అయితే ఏడాది పాటు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

నో కాస్ట్ ఈఎంఐ కాకుండా సాధారణ రెగ్యులర్ ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. రెండేళ్ల వరకు ఈఎంఐ టెన్యూర్ ఎంచుకోవచ్చు. రెండేళ్లు అయితే నెలకు రూ. 5762 ఈఎంఐ పడుతుంది. 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 7430 చెల్లించుకోవాలి. దాదాపు అన్ని రకాల క్రెడిట్ కార్డులపై కూడా ఇలాంటి ఈఎంఐ ఆప్షన్లే ఉంటాయి. అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ అందుబాటు ధరలోనే లభిస్తోందని చెప్పుకోవచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *