లాభాల్లో స్టాక్ మార్కెట్ ఆరంభం, వెనువెంటనే నష్టాల్లోకి పయనం;

లాభాల్లో స్టాక్ మార్కెట్ ఆరంభం, వెనువెంటనే నష్టాల్లోకి పయనం;

భారత స్టాక్ మార్కెట్లు(Stock Market) నేడు లాభాల్లో ఆరంభమయ్యాయి. కానీ వెనువెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచ మార్కెట్లు నెగిటివ్ సంకేతాలివ్వడం, టెక్నికల్ గా కీలక 18900 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఎదురుకావడంతో నిఫ్టీ వెనుకంజ వేస్తోంది.

ఎర్నింగ్స్ సీజన్ ముగిసిపోతుండడంతో సూచీలకు(Stock Market) ముందుకు సాగే బలమైన కారణాలు దొరకలేదు. పైగా నిఫ్టీ(nifty) వరుసగా కొన్ని సెషన్ల పాటు ఆల్ టైమ్ హై నమోదు చేయడంతో నిరోధం ఎదుర్కొంటోంది. నిఫ్టీ కొన్ని రోజులుగా 18600 పాయింట్ల పైన స్థిరంగా ఉండడంతో క్రమంగా కన్సాలిడేషన్ జరగవచ్చని నిపుణుల అంచనా.

నేటి ఆరంభం:

నేడు నిఫ్టీ(nifty) 18,719.55 పాయింట్ల వద్ద పాజిటివ్ గా ఆరంభమై అనంతరం 32 పాయింట్ల నష్టంతో 18,664 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 62,865 పాయింట్ల వద్ద ఆరంభమై 131 పాయింట్ల నష్టంతో 62,773 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ 18880 పాయింట్ల పైన ట్రేడవుతే క్రమంగా 19000 పాయింట్లను చేరవచ్చని, అనంతరం 19200 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని, దీన్ని కూడా దాటితే 20వేల వైపుగా పరుగు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నిఫ్టీ సెక్టోరల్స్:

నేడు నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.14 శాతం నష్టంతో, స్మాల్ క్యాప్ సూచీ 0.40 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ(nifty) మీడియా, మెటల్, రియల్టీ రంగాల సూచీలు కొద్ది పాటి లాభాల్లో మిగిలిన సెక్టోరియల్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఇండియా వీఐఎక్స్ 13.60 వద్ద కదలాడుతోంది. వీఐఎక్స్ 16-17 స్థాయిలకు దిగువన ఉంటే మార్కెట్ కు పాజిటివ్ గా, ఆ స్థాయి పైన ఉంటే నెగిటివ్ గా భావిస్తారు.

ఎఫ్ అండ్ ఓ అంశాలు:

నేడు ఎన్ఎస్ఈ ఎఫ్అండ్ఓ బ్యాన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, డెల్టాకార్ప్, ఐబీహౌసింగ్ షేర్లున్నాయి.

ఆప్షన్స్ డేటా ప్రకారం 19000, 20000, 19500 పాయింట్ల వద్ద కాల్స్ అధికంగా ఉండగా, 18500, 18300, 18000 పాయింట్ల వద్ద పుట్స్ అధికంగా ఉన్నాయి. సూచీల్లో అత్యధిక కాల్స్ ఉన్న స్ట్రైక్ రేట్ నిరోధంగా, అత్యధిక పుట్స్ ఉన్న స్ట్రైక్ రేట్ మద్దతుగా పనిచేస్తుంటుంది.

ఇతర మార్కెట్లు:

అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు(Stock Market) లాభాల్లో కదలాడుతున్నాయి.

జపాన్ నికాయ్ దాదాపు 0.03 శాతం లాభంతో ఉంది. హాంకాంగ్ సూచీ హాంగ్ సెంగ్ దాదాపు 3.5 శాతం లాభంతో ట్రేడవుతోంది.

అమెరికా మార్కెట్లు(Stock market) గత సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. నేడు అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

డాలర్ స్థిరంగా ఉండగా, బ్రెంట్ క్రూడాయిల్ లాభనష్టాల్లో కదలాడుతోంది.

 

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *