మనం తీసుకునే రుణాలకు లెక్కలు వేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. మనకొచ్చే ఆదాయం, పెట్టే ఖర్చును లెక్కలోకి తీసుకోవాలి. కొత్తగా తీసుకునే రుణాలు, మనం చెల్లించాల్సిన వాయిదాలు రాసుకుని భవిష్యత్ పై ఆలోచించాలి.
మనం తీసుకున్న రుణాలు వచ్చే ఆదాయానికి పొంతన లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. చేసిన అప్పులను ఎలా తీర్చాలనే దానిపై ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి. లేదంటే సమస్యలు తప్పవు. అందుకే మన ఆదాయానికి అనుగుణంగా అప్పులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Debt Woes
మనకున్న అప్పుల్లో అధిక వడ్డీ చెల్లించే వాటిని మొదట చెల్లిస్తే మనకు డబ్బు ఖర్చు కాదు. ఆదా అవుతుంది. తరువాత కొద్ది మొత్తంలో వడ్డీ చెల్లించే వాటి మీద దృష్టి పెట్టాల్సిన విధంగా ప్రణాళిక రచించుకోవాలి. ముందస్తు చెల్లింపులు చేపడితే రుణభారం రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. తక్కువ రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడులు పెద్దగా ప్రయోజనం చేకూర్చవు. జీవిత బీమా పాలసీలపై రుణాలు తీసుకోవద్దు. బంగారం హామీగా ఉంచి కూడా అప్పు తీసుకుంటే నష్టమే. ఇలా జాగ్రత్తలు తీసుకుని తక్కువ వడ్డీకి తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది.
మన ఆదాయ మార్గాలను పెంచుకునే చర్యలు తీసుకోవాలి. ఆదాయ, అప్పుల నిష్పత్తిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే మంచిది. అప్పులను వీలైనంత తొందరగా తీర్చేందుకు ప్రయత్నించాలి. రుణ ప్రణాళికలు అమలు చేసి మన కష్టాలు తీర్చుకోవాలి. లేకపోతే అప్పులు పెరిగితే అనర్థాలే. వాటిని చెల్లించలేక డీలా పడితే ఇంకా కష్టాలు ఎదురవుతాయి. ఇప్పటికే తప్పులు చేసి అప్పులు చేసిన మనం విలాస వ్యయాలు నియంత్రించుకుని కొన్నాళ్ల పాటు తక్కువ మొత్తంలో జీవించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొత్త రుణాలు, క్రెడిట్ కార్డులు వాడకూడదు. దీంతో అప్పులు త్వరగా తీరి ఉపశమనం లభిస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేసినప్పుడు శుభకార్యాలంటూ ఉన్న డబ్బును వృథా చేసుకోవద్దు. అప్పులు తీరే వరకు ఎలాంటి ఇతర ఖర్చుల జోలికి వెళ్లకూడదు. ఒకవేళ వెళితే ఏదైనా ఈఎంఐ తప్పితే జరిమానాలు కట్టాల్సి వస్తుంది. పండగలంటూ గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోవద్దు. ఉన్న అప్పులను తీర్చుకుని తరువాత ఇతర అప్పుల జోలికి వెళ్లడం ఉత్తమం. అంతేకాని ఒకదాని మీద మరొకటి అప్పులు ఎడాపెడా చేస్తే గొడవలే వస్తాయి. ఈ విషయాలు గమనించుకుని జాగ్తత్తలు తీసుకుంటే సరి