అల్పపీడనం ఎఫెక్ట్ – ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు అక్కడ భారీ వర్షాలు,

ఉపరితల ఆవర్తనం బలపడి తేలికపాటి అల్పపీడనంగా మారింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.

నేడు సైతం ఏపీ, తెలంగానలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మధ్య బంగాళాఖాతం, కొమరిన్‌ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తా తీరాల వైపు

కదులుతుందని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాలు రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి.

తెలంగాణలో వాతావరణం ఇలా 
బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం ప్రభావం రెండు రోజుల వరకు రాష్ట్రంపై ఉండనుంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 16 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

నేడు సైతం రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు వర్ష సూచనతో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని గంటల్లో సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ములుగు, కరీంగనర్, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..

కోస్తాంధ్రలోని సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, కాకినాడ, కొనసీమ, పశ్చిమ గోదావరి (కోస్తా భాగాలు మాత్రమే) జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అత్యధికంగా కొనసీమ జిల్లాలోనే వర్షాలుంటాయి. కొన్ని చోట్లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడ పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంది. నేడు కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల​, ప్రకాశం, పలుచోట్ల వర్షాలు పడతాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. కానీ కడప జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలతో పాటుగా సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ వర్షాలుంటాయి. కానీ గత ఐదు రోజులతో పోలిస్తే ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో తక్కుగానే వర్షాలుండే అవకాశాలున్నాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *