ఒంటరిగా ఉండటాన్నే చాలా మంది లోన్లీగా ఉండటం అనుకుంటారు. అది అస్సలు కాదు. అందరిలో ఉన్నా.. అందరూ మీతో ఉన్నా.. మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడమే లోన్లీనెస్. మీ చుట్టూ 100మంది ఉన్నా.. వారు ఎవరూ మీ హృదయానికి దగ్గరగా రావట్లేదు అనిపించినప్పుడే మీరు నిజంగా లోన్లీగా ఫీల్ అవుతారు.
సింగిల్ ఉండటమనేది ఓ రకంగా బ్లెస్సింగ్. ఎందుకంటే ఫేక్ మనుషుల మధ్య ఉండటం కన్నా అదే బెటర్ అని మీకు చాలాసార్లు అనిపిస్తుంది. మీరు సింగిల్‌గా ఉన్నప్పుడు కన్నా… పదిమందితో ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అవుతారు చూడండి అదే నిజమైన ఒంటరితనం. సింగిల్‌గా ఉంటే ఒంటరి అనే ఫీల్ వస్తుందనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరు మీలా ఉంటారు. ఎవరి వల్ల సమస్యలుండవు. ఎవరి గురించి ఆలోచించనవసరం లేదు. మీకు నచ్చినట్లు ఉండే ఏకాంత సమయం ఎప్పుడూ ఒంటరిగా అనిపించదు.
ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో తేడా ఉంది. ఏకాంతంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఒత్తిడి ఉంటుంది.
ఈ ఒంటరితనం అనేది ఆధునిక జీవన విధానంలో మామూలు విషయంగా మారుతోంది. చుట్టూ ఎందరు ఉన్నా వారితో కలవలేని తనం పెరుగుతుంది. మనసులోని భావాలను ఎదుటివారితో షేర్ చేసుకునే తత్వం కూడా తగ్గిపోతూ వస్తుంది.
నా అన్నవాళ్ళు లేక ఒంటరితనం అనుభవించే వారికన్నా అందరూ ఉండి ఒంటరితనంలో కూరుకుపోయేవారు కొందరు., ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో తేడా ఉంది. ఏకాంతంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఒత్తిడి ఉంటుంది. ఇది మనిషిని నెమ్మదిగా డిఫ్రెషన్ వైపు కుంగదీస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
ఈ నిరంతర ఒంటరితనం అనేది ఒక మానసిక రుగ్మతలా మారుతూ ఉంది. ఒంటరితంలో ఉంటూ ఎదుటివారు తనతో కలవడం లేదనే కొత్త కోణంలోంచి మిగతావారిని చూస్తారు. దీనితో ఎవరితోనూ మనసులో భావాలను పంచుకోకపోవడం, వారిలో వారే కుమిలిపోవడం
లాంటి సమస్యల్లో కూరుకుపోతున్నారు.
2014లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, “ఒంటరిగా ఉండటం వల్ల కాదు, మన చుట్టూ ఉన్నవారితో సంబంధం లేనట్టు ఉండటం వారిని దూరం పెట్టడం వల్ల ఒంటరితనం ఏర్పడుతుంది.”అని తేలింది. ఈ ఒంటరితనం అనేక సైకలాజికల్ సమస్యలకు దారితీస్తుందని శారీరక ఆరోగ్య సమస్యలకు కూడా దోహదపడుతుందని ఈ అధ్యయనం చెపుతుంది. ఒంటరితనం CtrA అనే జన్యువు శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. 2018లో జరిపిన మరో అధ్యయనంలో ఒంటరితనం లోని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలింది.
దీనిని అదిగమించే మార్గాలు.. ఇవి.
1. ఒంటరితనం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోండి. పరిష్కారానికి దారులు వెతకండి.
2. ఎవరితోనూ కలవలేకపోవడంలో కారణమైన మీలోని లోపాలను అంగీకరించండి.
3. వాస్తవ ప్రపంచంలో మీ చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.
4. వాస్తవ ప్రపంచంలో సంబంధాలను ఏర్పరచుకోవడం ముఖ్యం. స్నేహితులను తరుచుగా కలిసి వారితో కొంత సమయాన్ని గడపండి.
5. ఇతరులతో కలిసి చేయగలిగే పనుల కోసం సమయాన్ని వెచ్చించండి.
రోజువారీ జీవితంలోని అనుభవాలలో మునిగిపోండి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి.
7. కుటుంబంతో గడిపే క్షణాలను ఆస్వాదించండి. కమ్మని సంగీతాన్ని వినండి.
ఒంటరితనంతో పోరాటం చేయడానికి చురుకైన ప్రయత్నాలు చేయండి. ఇలాంటి వ్యాపకాలతో ఒత్తిడి నుంచి డిఫ్రెషన్ అందుకు కారణమైన ఒంటరితనం అన్నీ దూరం అవుతాయి.