జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే.
తొలుత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదగా.. నోవాటెల్ హోటల్‌కి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో
పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి వాళ్ల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ప్రెస్‌మీట్ నిర్వహించిన తర్వాత విజయనగరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమం సమయంలోనే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడంతో.. ఏపీ
రాజకీయాలు వేడెక్కాయి. అంతకుముందు.. విశాఖ గర్జన ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు. ఆసుపత్రిలో మృతి చెందినవారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చలేనందుకా? కన్నుమూసిన బిడ్డను భుజాన వేసుకొని బైక్ మీద తీసుకువెళ్లేలా చేసినందుకా? అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా? దేనికి మీ గర్జనలు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ నగరం కాస్త పొలిటికల్ నగరంగా మారింది. వైస్సార్సీపీ , జనసేన, టీడీపీ పార్టీల నేతలతో రాజకీయంగా మారింది. అమరావతి రైతుల పాదయాత్ర , ‘మన విశాఖ-మన రాజధాని’ నినాదంతో వైస్సార్సీపీ ర్యాలీ , మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన తో వైజాగ్ నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
జనవాణి కార్యక్రమంతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన పర్యటన చేయబోతున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు చేసిన జనవాణికి ప్రజల నుండి విశేష స్పందన రాగ, విశాఖలో కార్యక్రమానికి భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ టూర్ కు సంబదించిన ఏర్పాట్లను మెగా బ్రదర్ నాగబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన విశాఖ కు చేరుకున్నారు.
పవన్ షెడ్యూల్ చూస్తే..
ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ ఏ డి ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్,బీచ్ రోడ్ మీదగా నోవాటల్ హోటల్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
ఇక రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలు తో సమావేశము ఉండనుంది. సోమవారం ఉదయం ప్రెస్ మీట్, అనంతరం విజయనగరం పార్టీ నేతలు తో సమావేశం కానున్నారు