తెలంగాణలో పలు ఉద్యోగాల భర్తీకి నటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిలో టీఎస్పీఎస్సీ, తెలంగాణ మెడికల్ బోర్డుకు సంబంధించి నియామక సంస్థల నుంచి నోటిపికేషన్లు భారీగా విడుదలయ్యాయి.
ఇప్పటికే దాదాపు 30కి పైగా నోటిఫికేషన్లు
వెలువడ్డాయి. వెలువడిన నోటిఫికేషన్లలో ఎక్కువగా జనవరి నెల నుంచే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. వీటిలో కొన్నింటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. మరికొన్ని పోస్టులకు పరీక్షలు కూడా ముగిశాయి. అయితే నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తులు సమర్పించడానికి చాలా మంది వెనుకాడతారు. తొందరగా చేసుకోవాలని బోర్డు అధికారులు చెబుతున్నా చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తుంటారు. తర్వాత సర్వర్ సమస్యలు రావడంతో ఇబ్బందులకు గురి అవుతుంటారు. విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రారంభ తేదీ.. ముగింపు తేదీ వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. దరఖాస్తుల కొరకు ఇక్కడ డైరెక్ట్ లింక్ ను ఉపయోగించండి.
నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
నోటిఫికేషన్ | ఖాళీలు | దరఖాస్తుల ప్రారంభం తేదీ | ముగింపు తేదీ |
గ్రూప్ 4 | 8039 | డిసెంబర్ 30, 2022 | జనవరి 31, 2023 |
హార్టికల్చర్ ఆఫీసర్ | 22 | జనవరి 03, 2023 | జనవరి 21, 2023 |
ఫిజికల్ డైరెక్టర్ | 128 | జనవరి 06, 2023 | జనవరి 27, 2023 |
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ | 581 | జనవరి 06, 2023 | జనవరి 27, 2023 |
అగ్రికల్చర్ ఆఫీసర్ | 148 | జనవరి 10, 2023 | జనవరి 30, 2023 |
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ | 113 | జనవరి 12, 2023 | ఫిబ్రవరి 01, 2023 |
గ్రూప్ 2 | 783 | జనవరి 18, 2023 | ఫిబ్రవరి 16, 2023 |
గ్రూప్ 3 | 1365 | జనవరి 24, 2023 | ఫిబ్రవరి 23, 2023 |
అకౌంట్స్ ఆఫీసర్, జేఏఓ | 78 | జనవరి 20, 2023 | ఫిబ్రవరి 11, 2023 |
డీఎల్ | 544 | జనవరి 31, 2023 | ఫిబ్రవరి 20, 2023 |
1. గ్రూప్ 4 ఉద్యోగాలు ..
మొదట పేర్కొన్న 9వేలకు పైగా ఖాళీలు కాకుండా.. 8వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. జనవరి చివరి వరకు అవకాశం ఉంది. ఇప్పటికే 4లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. వీటి సంఖ్య 8లక్షలకు వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.
2.హార్టి కల్చర్ ఉద్యోగాలు..
హార్ట కల్చర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖస్తుల ప్రక్రియ ఇప్పటికు ప్రారంభం అయింది. జనవరి 21 వకు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
3.ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలు..
ఇంటర్ , టెక్నికల్ విద్యాశాఖ లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఫిజికల్ ఎడ్యూకేషన్ లో మాస్టర్స్ చేసిన వాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
4.హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్..
బీఈడీ పూర్తి చేసి టెట్ అర్హత లేని వారికి ఇదొక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి..బీఈడీ/డీఈడీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారభం కాగా.. మరి కొన్ని రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనుంది.
5.అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు..
అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. జనవరి 27వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
6.అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్
ఎన్నో వివాదాల మధ్య మరో సారి విడుదలైన ఈ పోస్టులకు రెండు రోజుల క్రితమే దరఖాస్తుల ప్రక్రియ ప్రారభం అయింది. మహిళల అర్హత విషయంలో నోటిఫికేషన్ ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ మరోసారి వారి అర్హతలను సవరించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
7.గ్రూప్ 2 ఉద్యోగాలు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో సారి విడుదలైన నోటిఫికేషన్ ఇది. మొదటి నోటిఫికేషన్లో వెయ్యి పోస్టులకు పైగా విడుదల కాగా.. ఈ సారి 780 పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది.
కెరీర్ “>
8.గ్రూప్ 3 ఉద్యోగాలు..
తెలంగాన ఏర్పటైన దగ్గర నుంచి ఈ పోస్టులను విడుదల చేయడం మొదటిసారి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి నోటిఫికేషన్ కూడా అదే రోజు విడుదల కానుంది.
9.అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు
బీకాం కామర్స్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది.
10.డీఎల్ (డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్)
డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లలోనే ఫిజికల్ డైరెక్టర్, పీడీ పోస్టులు కూడా ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ జనవరి 31, 2023 నుంచి ప్రారంభం కానుండగా.. అదే రోజు దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారభం కానుంది. అయితే.. ఇటీవల అభ్యర్థులు ఈ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేయాలని.. టీఎస్ సెట్, యూజీసీ నెట్ ఫలితాల వరకు వెయిట్ చేయాలని కోరుతున్నారు. దీనిపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి