ఒకే సమయంలో రెండు ఫోన్లలో ఒకే నంబర్‌తో వాట్సాప్‌ వాడొచ్చు.. ఎలాగో తెలుసా?

ప్రపంచంలోనే బెస్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు తెచ్చుకుంది వాట్సాప్‌….

పాపులర్ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్  కంటిన్యూగా సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. రీసెంట్‌గా కమ్యూనిటీస్, కాల్ లింక్స్, స్టేటస్ రియాక్షన్స్, హైడ్ ఆన్‌లైన్ స్టేటస్ వంటి ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను పరిచయం చేసింది. తాజాగా ‘కంపానియన్ మోడ్ ‘ పేరుతో మరో ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. యూజర్లు తమ సెకండరీ ఫోన్‌లో  కూడా వాట్సాప్ అకౌంట్ లింక్ చేయడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. అంటే ఒకే వాట్సాప్ నంబర్‌తో రెండు ఫోన్లలో ఏకకాలంలో ఒకే అకౌంట్ వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ వాడే ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు రిలీజ్ అవుతోంది.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం చాలా మంది తమ బిజినెస్ యాక్టివిటీస్, జాబ్ రిలేటెడ్ వర్క్‌కు కూడా వాట్సాప్‌ను ఒక ప్లాట్‌ఫాంగా ఉపయోగిస్తున్నారు. అంటే అన్ని అవసరాలకూ దీన్ని యూజ్ చేసుకోవచ్చు\

అయితే ఒకే అకౌంట్‌ను రెండు ఫోన్లలో ఉపయోగించేందుకు వాట్సాప్‌ వీలు కల్పిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే రెండు స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ను యాక్సెస్ చేసుకునేందుకు సౌలభ్యం కల్పిస్తోంది

వాట్సాప్ యూజర్లు చాలామందికి రెండు ఫోన్లు ఉండవచ్చు. కానీ రెండింటిలో వేర్వేరు నంబర్లతో వాట్సాప్‌ను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకే నంబర్‌తో వాట్సాప్‌ను రెండు ఫోన్లలో యూజ్ చేసే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు చాట్ సింక్ సమస్యలు లేకుండా రెండు ఫోన్ల ద్వారా వాట్సాప్‌ వాడొచ్చు. ఇందుకు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ కింద చూడండి.

ఇలా చేయండి : మీరు వాడాలనుకుంటున్న రెండో ఫోన్‌లో వాట్సాప్‌ ఇన్‌స్టాల్ చేయండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి.. ఇప్పటికే వాట్సాప్‌ ఉన్న ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మెనూలోకి వెళ్లడానికి కుడివైపు పైభాగంలో కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్ బటన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ డిస్‌ప్లే అయ్యే ఆప్షన్స్‌ నుంచి ‘లింక్‌ డివైజ్’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *