ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు

బంగాళాఖాతంలో అల్పపీడనం
-రెండు రోజుల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్
-ఏపీలోని నాలుగు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

-నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలకు వర్ష సూచన
-ఈనెల 7, 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమను వర్షాలు ముంచెత్తనున్నట్లు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు తూర్పుగాలుల ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని, ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా వుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఏపీని తుపాను ముప్పు వెంటాడుతోంది. ముఖ్యంగా ఉత్తర ధ్రువంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం దక్షిణ థాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాత్రిపూట అండమాన్ సముద్ర ప్రాంతంలోకి ప్రవేశించి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి గురువారం వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఇది శుక్రవారం వాయువ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉంది. శనివారం ఉదయం తుపాను తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ఉత్తరాంధ్రలో తీరం దాటే అవకాశం లేదని, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. శుక్రవారం నుంచి మూడు ఉత్తరాంధ్ర (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు, పలుచోట్ల భారీ వర్షాలు, 4వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు వరి కోతలు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వాయిదా వేయాలని అధికారులు సూచించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు ఇప్పటికే అతలాకుతలమవుతున్నాయి.

గల్ఫ్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ నుంచి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 7 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 6వ తేదీకి వాయుగుండంగా, ఏడో తేదీకి తుపాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. ఈ నెల 9వ తేదీ రాత్రి లేదా 10వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేశారు. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో 7వ తేదీ రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నెల 8, 9 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని దక్షిణ కోస్తాలోని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *