కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అదిరిపోయే శుభవార్త అందించింది.
కీలక ప్రకటనలు చేసింది. వీటిల్లో పోస్టాఫీస్ స్కీమ్స్‌కు సంబంధించి కూడా ముఖ్య ప్రతిపాదనలు ఉన్నాయి. దీని వల్ల ఆయా స్కీమ్స్‌లో డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగనుంది.
కేంద్రం తీసుకున్న బడ్జెట్ 2023 నిర్ణయాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ పెంపు కూడా ఒకటి ఉంది. దీని వల్ల ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఇకపై అధిక మొత్తాన్ని పొందే వెసులుబాటు ఉంటుంది
ఇదివరకు రూ. 15 లక్షల వరకు డబ్బులు దాచుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇకపై ఈ లిమిట్ రూ. 30 లక్షలకు చేరుతుంది. అంటే సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ కింద రూ. 30 లక్షల వరకు డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అధిక వడ్డీ రాబడి కూడా సొంతం చేసుకోవచ్చు
ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఇది ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఇతర వాటి కన్నా ఈ పథకంలోనే అధిక వడ్డీ వస్తోంది. ఈ వడ్డీ రేట్లు అనేవి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కేంద్రం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై త్రైమాసికం చొప్పున వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది.
ఇకపోతే స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ మెచ్యూరిటీ కాలం దాటిన తర్వాత మరో మూడేళ్ల వరకు స్కీమ్‌ను పొడిగించుకోవచ్చు. ఇప్పుడు మనం 8 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఎంత నెలవారీ వడ్డీ రాబడి పొందొచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
మీరు ఎస్‌సీఎస్ఎస్ స్కీమ్‌లో రూ. 30 లక్షలు డిపాజిట్ చేశారని అనుకుంటే.. మీరు నెలకు రూ. 20 వేలు వడ్డీ రూపంలో లభిస్తాయి. మూడు నెలలకు రూ. 60 వేలు లభిస్తాయి. అదే ఏడాదికి అయితే రూ. 2,40,000 వస్తాయి. ఇక ఐదేళ్లలో మీరు వడ్డీ రూపంలోనే రూ. 12 లక్షలకు పైగా పొందొచ్చు.\
రూ. 30 లక్షలు లేదనుకుంటే.. రూ. 5 లక్షలు పెడితే నెలకు రూ. 3333 వడ్డీ రూపంలో పొందొచ్చు. అంటే ఐదేళ్లలో రూ.2 లక్షలు వస్తాయి. ఇక రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మీకు వడ్డీ రూపంలో ఐదేళ్లలో రూ. 4 లక్షలు లభిస్తాయి. నెలకు రూ. 6667 పొందొచ్చు.
అదే రూ. 25 లక్షలు పెడితే మీకు ఐదేళ్లలో రూ. 10 లక్షలు వడ్డీ రూపంలోనే వస్తాయి. రూ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో రూ. 8 లక్షలు వడ్డీ పొందొచ్చ. నెలకు రూ. 13,333 పొందొచ్చు