DHFL స్కామ్: ₹34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సిబిఐ మంగళవారం అరెస్టు చేసినట్లు అధికారుల ప్రకటనలు తెలియజేశాయి. వాధావాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకుని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు, అక్కడ అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నివేదికల ప్రకారం, 2022లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ అతడిపై ఇప్పటికే చార్జిషీట్ చేసింది. యెస్ బ్యాంక్ అవినీతి కేసుకు సంబంధించి వాధావాన్‌ను గతంలో ఏజెన్సీ అరెస్టు చేసి,…
జియో 5జి అందుబాటులోకి వస్తోంది: నగరాల జాబితా, ఎలా యాక్టివేట్ చేయాలి, 5G ప్లాన్‌లు మరియు మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు
రిలయన్స్ జియో ప్రస్తుతం 2023 చివరి నాటికి పాన్ ఇండియా అంతటా తన 5G నెట్‌వర్క్‌ని అమలు చేయాలనే లక్ష్యంతో ఉంది. అక్టోబర్ 2022లో ప్రారంభించబడిన జియో ట్రూ 5G ప్రారంభించిన 4 నెలల్లోనే భారతదేశంలోని దాదాపు 200 నగరాలకు చేరుకుంది. నిబద్ధతను అనుసరించి, రాబోయే రోజుల్లో టెల్కో మరిన్ని నగరాలను కవర్ చేస్తుంది. ఇటీవలి విస్తరణలో, అరుణాచల్ ప్రదేశ్ (ఇటానగర్), మణిపూర్ (ఇంఫాల్), మేఘాలయ (షిల్లాంగ్), మిజోరం (ఐజ్వాల్), నాగాలాండ్ (కోహిమా మరియు దిమాపూర్), మరియు…
25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే
25 నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ.. పూర్తి లిస్ట్ ఇదే ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ క్రమంగా దేశంలో 5జీ నెట్‍వర్క్‌ను విస్తరిస్తోంది. గతేడాది నవంబర్‌లో 5జీ సర్వీస్‍లను లాంచ్ చేసిన ఆ సంస్థ ముందుగా ప్రధాన నగరాలకు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు దేశంలోని 25 నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను అందిస్తోంది ఎయిర్‌టెల్. 2024 మార్చి కల్లా దేశమంతా 5జీ నెట్‍వర్క్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.కాగా, ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ అందుబాటులో ఉన్న 25 నగరాలు…
పాత వెయ్యి నోటు ఉంటే.. రూ.3.5 లక్షలు మీ సొంతం..
అరుదైన కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించే వారిలో మీరు ఒకరైతే, భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి మీకు అవకాశం వచ్చింది. ఏదైనా ప్రత్యేకమైన క్రమ సంఖ్యలు, వాటిపై ముద్రించిన చిత్రాలు, కరెన్సీ నోటు లేదా నాణేలను అరుదైనవిగా గుర్తిస్తారు. ఇలాంటి వాటిని సొంతం చేసుకోవడానికి కొందరు పోటీ పడుతుంటారు. మోడీ ప్రభుత్వం 2016 నవంబర్ లో రూ.500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. సీరియల్ నంబర్ అయితే నిషేధించిన పాత వెయ్యి నోటుకు యూకేలో విపరీతమైన…
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖలో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విశాఖపట్నం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. త్వరలో విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇప్పటికే వైసీపీ నేతలు మీడియా వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. అమెజాన్ .ఇన్ ఇటీవల దేశంలో దాని నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలను ప్రకటించింది. అమెజాన్ తన మొదటి అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది మరియు దాని కోసం విశాఖపట్నంను ఎంచుకున్నట్లు సమాచారం. గాజువాకలో ఏర్పాటు చేయనున్న ఫిల్‌మెంట్ సెంటర్‌లో 10…
ఆన్‌లైన్‌లో యాసిడ్ అమ్మకాలు… ఫ్లిప్‌కార్ట్, మీషోలకు కేంద్రం నోటీసులు
ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై జరిగిన యాసిడ్ దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ దాడికి పాల్పడ్డవారు ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొన్నట్టు తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగానికి చెందిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై గట్టి చర్యలు తీసుకుంది. సమాజంలో పెరుగుతున్న నేరాల…
సరికొత్త స్టైల్‌లో మళ్లీ మార్కెట్‌లోకి రానున్న టాటా నానో.. ఫీచర్స్, ధర విషయానికొస్తే..!
సరికొత్త స్టైల్‌లో మళ్లీ మార్కెట్‌లోకి రానున్న టాటా నానో.. ఫీచర్స్, ధర విషయానికొస్తే..! ప్రముఖ ఇండియన్ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఏం చేసిన అదో ట్రెండ్ సెట్టర్. గతంలో సామాన్యుల కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో రూ.లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ…
మరొక రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్;
మరొక రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్; దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్ కార్ట్ “బిగ్ సేవింగ్ డేస్” పేరుతో మరో సారి సేల్ ను ప్రారంభించనుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించనున్న ఈ సేల్ డిసెంబర్ 16 న ప్రారంభమై డిసెంబర్ 21వ తేదీన ముగుస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే ఫ్లిప్ కార్ట్…
ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఐఫోన్ లవర్స్ గుడ్ న్యూస్. యాపిల్ సంస్థ ఐ ఫోన్ 15 ఆల్ట్రాను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 వినియోగదారులను అంత సంతృప్తి పరచలేదు. అంతకు ముందు మోడల్ కు దీనికి పెద్దగా వేరియేషన్ లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందారు. ఇప్పుడు దానికి అప్ గ్రేడ్ వెర్షన్ గా ఐఫోన్ 15 ఆల్ట్రాను తీసుకొస్తోంది. దీని ధర ఇంకా నిర్ధారణ…
రూ. 56 వేల ఆపిల్ ఐఫోన్ 12 ను రూ 31,499 కే సొంతం చేసుకోవచ్చు.. రూ.28,401 డిస్కౌంట్;
రూ. 56 వేల ఆపిల్ ఐఫోన్ 12 ను రూ 31,499 కే సొంతం చేసుకోవచ్చు.. రూ.28,401 డిస్కౌంట్; ప్రస్తుతం ఐఫోన్ ట్రెండ్ నడుస్తోంది. ఐఫోన్ వాడడం ఒక డ్రీమ్ గా కూడా పెట్టుకుంటారు చాలామంది. డబ్బున్న రిచ్ పీపుల్ అయితే వెంటనే తమ కలను నెరవేర్చుకుంటారు. కాని పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమ డ్రీమ్ ను నెరవేర్చుకోవడానికి ఎక్కువ సమయమే పడుతోంది. ప్రస్తుతం EMI ల కాలం కావడంతో మరికొంత మంది కొంత…