డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ప్రకారం డిపార్ట్‌మెంట్‌లో 70 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10న ముగియాల్సి ఉంది.. అయితే డిపార్ట్‌మెంట్ దరఖాస్తు చివరి తేదీని పొడిగించింది. ఇప్పుడు అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం నవంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్ నోట్ విడుదల చేశారు. ఎస్సీ 23, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 22, జనరల్ 13 పోస్టులను కేటాయించారు. జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్ (గ్రూప్-సి) పోస్టులను ఈ నోటిఫికేషన్ల భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్‌లో సైన్స్/కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో డిప్లొమా లేదా కనీసం 60 శాతం మార్కులతో సమానమైన కోర్సు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు..
దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజును సమర్పించాల్సి ఉంటుంది . జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సి /ఎస్టి/పిడబల్యూమహిళలు/ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు సడలింపు వర్తిస్తుంది.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక ఇలా..
రాత పరీక్ష (టైర్-1 మరియు టైర్-2) ఆధారంగా జరుగుతుంది. రెండు విభాగాల్లో కలిపి 300 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. టైర్-I ఆన్‌లైన్ మోడ్‌లో 200 ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష 200 మార్కులకు రెండు గంటల్లో నిర్వహించబడుతుంది. జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగంలో 3 గంటల వ్యవధిలో 100 మార్కులు ఉంటాయి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను హెట్ప్స్://డిఫ్స్డిపిఏ.ఫామ్ఫ్లిక్ .ఇన్ సందర్శించండి.
దరఖాస్తు ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిచాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-అక్కడ కనిపిస్తున్న న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంచుకోండి.
-కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో పర్సనల్ వివరాలను నమోదు చేసి.. సబ్ మిట్ చేయాలి.
-మీరు అప్లికేషన్లో ఇచ్చిన మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్ వర్డ్ వస్తాయి.
-వాటిని ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
-దీనిలో దరఖాస్తు ఫీజు చెల్లించి.. ఫైనల్ అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది.