కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో ఇప్పటికే రెండుసార్లు సవరణ చేసిన విషయం తెల్సిందే.
ఇప్పుడు మరోసారి తాజాగా ఎస్‌ఎస్‌సీ.. ఆ సంఖ్యను 50,187కి పెంచుతున్నట్టు మార్చి 20వ తేదీన (సోమవారం) ప్రకటించింది
వయోపరిమతిని కూడా..
అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడటం, నోటిఫికేషన్లు రాకపోవడంతో ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వయోపరిమతిని కూడా మూడేళ్ల పాటు పెంచుతున్నట్లు ఎస్‌ఎస్‌సీ ప్రకటించింది. ఎస్ ఎస్సి జిడి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ అక్టోబర్ 27న విడుదల కాగా.. పరీక్షను కూడా నిర్వహించారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24369 ఖాళీ పోస్టులను ఎస్‌ఎస్‌సీ ఇటీవల పేర్కొనగా.. తర్వాత నెల రోజులకు ఈ పోస్టులను పెంచుతున్నట్లు కమిషన్ వెబ్ సైట్లో పేర్కొంది.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2022: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్-cisfrectt.in ద్వారా ఆన్‌లైన్‌లో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, సిఐఎస్ఎఫ్ 787 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది
ఈఎస్ ఎస్సి జిడి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో, బిఎస్ఎఫ్ యొక్క 7545 పోస్టులు, సి ఐఎస్ఎఫ్ యొక్క 8464 పోస్ట్‌లు, ఎస్ఎస్బి యొక్క 3806 పోస్ట్‌లు, ఐటిబిపి యొక్క 1431 పోస్ట్‌లు మరియు ఎస్‌ఎస్‌ఎఫ్ యొక్క 240 పోస్ట్‌లు ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వేతనం ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
24369 నుంచి 50,187 వరకు పెరిగిన ఉద్యోగాలు ఇవే..
దాదాపు 25 వేల నుంచి 45,284 వరకు ఈ పోస్టులను పెంచగా.. ఇదే క్రమంలో ఫిబ్రవరిలో మరోసారి సవరణ చేస్తూ 1,151 ఉద్యోగ ఖాళీలను కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 46,435కి పెరిగింది. ఇప్పుడు తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 50,187కు పెరిగినట్టు ఎస్‌ఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. రాష్ట్రాల వారీగా పోస్టుల ఖాళీలను కూడా ప్రకటించింది.
పోస్టుల వివరాలు ఇలా..
బీఎస్‌ఎఫ్‌లో 21,052, సీఐఎస్‌ఎఫ్‌లో 6060, సీఆర్‌పీఎఫ్‌లో 11169, ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890+3752, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175తో కలిపి మొత్తం 50,187 ఖాళీలున్నాయి.
ఎంపిక విధానం ఇలా..
ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ ఐదు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , మెడికల్ ఎగ్జామినేషన్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ఐదు దశల్లో ఎంపిక చేస్తారు.
జీతం :
సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ చేసిన వారికి NCB సిపాయి పోస్టుకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు జీతం లభిస్తుంది. ఇతర పోస్టులకు రూ. 21,700 నుంచి 69,100 మధ్య జీతం లభిస్తుంది.