హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త

హెచ్‌డీఎఫ్‌సీ తన కస్మర్లకు దీపావళి తీపికబురు అందించింది. రుణ రేట్ల తగ్గింపుతో కస్మర్లకు ప్రయోజనం కలిగించింది. రేట్ల తగ్గింపుతో పాత కస్మర్లతోపాటు కొత్త కస్మర్లకు కూడా లాభం చేకూరనుంది.

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ   తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఎఫ్డిరేట్ పెంచడం ఈ నెలలో ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. బ్యాంక్ రేట్ల పెంపు నిర్ణయం అక్టోబర్ 26 నుంచే అమలులోకి వచ్చింది. అంటే ఈరోజు నుంచే వడ్డీ రేట్లు పెరిగాయి.

బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. 61 రోజుల నుంచి 89 నెలల ఎఫ్‌డీలపై బ్యాంక్ ఇదివరకు 4 శాతం వడ్డీ రేటును అందించేది. అయితే ఇప్పుడు ఈ వడ్డీ రేటు 4.5 శాతానికి చేరింది. అంటే వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగిందని చెప్పుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 61 రోజుల నుంచి 89 నెలల కాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గతంలో ఇంట్రస్ట్‌ రేట్లు 4శాతం ఉండగా ఇప్పుడు (50బేసిస్‌) 4.50 శాతానికి పెంచింది.

90 రోజుల నుంచి 6 నెలల కాలానికి.. గతంలో 4.25 శాతం ఉండగా ఇప్పుడు 4.50 శాతానికి పెంచింది.

1 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ 6 నెలల తగ్గకుండా చేసిన ఎఫ్‌డీలపై నిన్న వరకు 5 శాతం వడ్డీని చెల్లించేది. ఇప్పుడు ఆ వడ్డీని 5.25 శాతానికి పెంచింది.

1 రోజు నుంచి ఏడాదికి కాలానికి 9 నెలలు ఎఫ్‌డీని కొనసాగిస్తే.. వాటిపై 5.50శాతం వడ్డీని పొందవచ్చు.

గమనిక :పెరిగిన పిక్స్‌డ్‌ రేట్లు

ఒక సంవత్సరం నుండి 15 నెలల ఎఫ్‌డీ టెన్యూర్‌ కాలానికి 6.10 శాతం, 15 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 6.15 శాతం ఇంట్రస్ట్‌ పొందవచ్చు.

ఒక రోజు నుండి ఐదేళ్ల లోపు అంటే (రెండేళ్ళ టెన్యూర్‌ కాలానికి) చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.25 శాతం, ఐదు నుంచి పదేళ్ల టెన్యూర్‌ కాలానికి 6.20 శాతం వడ్డీని పొందవచ్చు.

60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారు.

గమనిక : పెరిగిన రికరింగ్‌ డిపాజిట్‌ రేట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలానికి చేసే సాధారణ రికరింగ్‌ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *