ప్రముఖ సోషల్ దిగ్గజం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటి.
ప్రపంచంలో 2 బిలియన్లకు పైగా మంది యూజర్లు వాట్సాప్ వినియోగిస్తున్నారు. వాట్సాప్ తమ యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్‌లను యాడ్ చేస్తూనే ఉంది.
ఇప్పుడు చాట్ లిస్ట్‌లో ఆన్రీడ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేసే ఫీచర్ కూడా తీసుకొస్తోంది. చదవని అన్ని చాట్‌లను త్వరగా వీక్షించేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఆన్రీడ్ మెసేజ్‌ల కోసం మీ వాట్సాప్ చాట్ లిస్టును ఎలా ఫిల్టర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఆపిల్ ఐఫోన్ కోసం వాట్సాప్ బిజినెస్లో ఫీచర్ అందుబాటులో లేద
ని గమనించాలి.
ఆపిల్ ఐఫోన్లో :
* ఐఫోన్లోవాట్సాప్ ఓపెన్ చేయండి.
* సెర్చ్ బార్‌ను బహిర్గతం చేసేందుకు చాట్ లిస్ట్‌లో పైకి స్క్రోల్ చేయండి
* ఆపై, సెర్చ్ బార్‌లో కుడి వైపున ఉంచిన ఫైలర్ ఐకాన్‌పై టాప్ చేయండి.
* ఐకాన్ ఆఫ్ చేసేందుకు దాన్ని మళ్లీ టాప్ చేయండి.
ఆండ్రాయిడ్లో:
* మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
* సెర్చ్ బాక్స్ని టాప్ చేయండి.
* ఆపై ఫోటోలు, వీడియోలు, లింక్‌లు, GIFలు, మరిన్ని వంటి ఆప్షన్లతో ఆన్రీడ్ మెసేజ్‌లపై టాప్ చేయండి.
* ఫిల్టర్‌ను ఆఫ్ చేసేందుకు X లేదా బ్యాక్‌స్పేస్‌ను టాప్ చేయండి.
వెబ్ లో :
* మీ కంప్యూటర్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
*సెర్చ్ బాక్స్కి కుడి వైపున ఉన్న ఫిల్టర్ ఐకాన్పైక్లిక్చేయండి.
* ఫిల్టర్‌ను ఆఫ్ చేసేందుకుఐకాన్మళ్లీక్లిక్చేయండి.
వాట్సాప్ కొంతమంది యూజర్లు తమ అకౌంట్‌ను ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో ఉపయోగించడానికి అనుమతిస్తుంది. బిజిఆర్ నివేదిక ప్రకారం, ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ బీటా టెస్టర్‌లు వారి వాట్సాప్ అకౌంట్‌ను రెండవ డివైజ్‌తో అంటే టాబ్లెట్‌తో లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ ట్యాబ్లెట్ వెర్షన్‌తో తమ అకౌంట్ లింక్ చేయమని బీటా ఛానెల్‌లోని యూజర్లను వాట్సాప్ అలర్ట్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్లు ఆండ్రాయిడ్ టాబ్లెట్ కలిగి ఉన్నారా? టాబ్లెట్ కోసం వాట్సాప్ బీటా టెస్టర్‌ల కోసం అందుబాటులో ఉంది. బ్యానర్‌పై టాప్ చేయడం ద్వారా స్క్రీన్ దిగువన పాప్-అప్ఓపెన్ అవుతుంది. వాట్సాప్ అకౌంట్ టాబ్లెట్ వెర్షన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ డెస్క్‌టాప్ క్లయింట్ కోసం కొత్త చాట్ ఫిల్టర్‌ని పరీక్షిస్తోందా?
వాట్సాప్ డెస్క్‌టాప్ క్లయింట్ కోసం కంపెనీ ఇప్పుడు కొత్త చాట్ ఫిల్టర్‌ను పరీక్షిస్తున్నట్లు డబ్ల్యూబీటాఇన్ఫో నివేదించింది. ఫీచర్ ప్రస్తుతం డెస్క్‌టాప్ క్లయింట్ వెర్షన్ 2.2221.1లో భాగం. నివేదిక ప్రకారం, ప్లాట్‌ఫారమ్‌లో చదవని చాట్‌లను కనుగొనడంలో మరియు చదవడంలో వ్యక్తులకు సహాయం చేయడానికి ఈ ఫిల్టర్ రూపొందించబడింది
వాట్సాప్ చదవని చాట్ ఫిల్టర్ అంటే ఏమిటి?
ఫీచర్ ప్రస్తుతం డెస్క్‌టాప్ క్లయింట్ వెర్షన్ 2.2221.1లో భాగం. నివేదిక ప్రకారం, ప్లాట్‌ఫారమ్‌లో చదవని చాట్‌లను కనుగొనడంలో మరియు చదవడంలో వ్యక్తులకు సహాయం చేయడానికి ఈ ఫిల్టర్ రూపొందించబడింది. డెస్క్‌టాప్ కోసం వాట్సాప్ బీటాలో సెర్చ్ బార్ పక్కన ఫిల్టర్ ఉంచబడింది.