కాటేసిందన్న కోపంతో పామును కొరికి చంపిన బాలుడు .. ఆ తరువాత ఏం జరిగిదంటే..

పాము మనుషులను కాటేయడం తరచూ వింటుంటాం. కానీ ఓ బాలుడు పామును కాటేసి చంపేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పాములు మనుషుల్ని కరవడం రొటీన్. కానీ మనుషులు పాముల్ని కరవడం వింత. ఇటీవలి కాలంలో ఇలాంటి వింత సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. తనను కరిచిందన్న కోపమో, దారికి అడ్డు వచ్చిందనో.. కారణమేదైనా కానీయండి మనుషులు పాముల్ని కరవడం, కొరికి చంపడం కామన్ అయిపోతోంది.

అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిని పాము కాటేసింది. వెంటనే ఆ వ్యక్తి భయపడలేదు. బెదిరిపోలేదు. వణికిపోలేదు. పాము మీద కోపానికి వచ్చాడు. నన్నే కరుస్తావా అంటూ ఆగ్రహంతో ఆ పామును పట్టుకుని గట్టిగా కరిచేశాడు. దీంతో పాపం ఆ పాము చచ్చి ఊరుకుంది.

వివరాల్లోకి వెడితే.. జాజ్ పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర (45) గిరిజన రైతు.  బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని.. పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. ఇంతలో కొద్ది దూరం వచ్చేసరికి అతని కాలికి ఏదో గుచ్చుకున్నట్టు అయ్యింది. చూస్తే ఏదో కరిచినట్టు ఉంది.

దీంతో చేతిలోని టార్చ్ లైట్ వేసి చుట్టు పక్కల చూశాడు. తనను కరిచింది పాము అని అర్థమ్యింది. అది కూడా విషపూరితమైన సర్పం అని గుర్తించాడు. అంతే కోపంతో ఊగిపోయాడు. ప్రతీకారంతో చెలరేగిపోయాడు. పామును పట్టుకుని కొరకడం మొదలు పెట్టాడు. కోపం తీరేదాకా దాన్ని కొరికి, కొరికి వదిలిపెట్టాడు.

ఈ చర్యకు పాపం పాపం బిత్తరపోయి ఉండొచ్చు. కానీ దానికంతగా తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండానే దాన్ని కొరికేశాడు. దాంతో అది దెబ్బకు చచ్చి ఊరుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పామును కరిచిన  కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

దీంతో కిశోర్ బద్ర ఊరుకోలేదు. చచ్చిన సారీ.. సారీ.. చంపిన పామును తీసుకుని ఊర్లోకి వచ్చాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆమె షాక్ తో ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా ఊరంతా తెలిసిపోయింది. దీంతో గ్రామంలో ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌ ప్రాంతంలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడిని పాము కాటేసిందన్న కోపంతో పామును వెంబడించి కొరికి చంపాడు. పాము చనిపోగా.. బాలుడు క్షేమంగా బయటపడ్డాడు.

జష్‌పూర్ జిల్లా పండారా పాత్ గ్రామానికి చెందిన దీపక్ రామ్ తన ఇంటికి కూతవేటు దూరంలో ఉంటున్న తన అక్కవాళ్లింట్లో ఆడుకుంటున్నాడు. దీపక్ అక్కడి పిల్లలతో ఆడుకుంటుండగా పక్కనే ఉన్న పొదలో నుంచి నాగుపాము బయటకు వచ్చి తన చేతికి తాకింది. దానిని వదిలించుకొనే క్రమంలో దీపక్ కుడిచేతి బొటనవేలును పాము కాటు వేసింది. తనకు నొప్పిగా ఉండటంతో పాము కాటేసిందని గుర్తించాడు. ఒక్కసారిగా కోపంరావటంతో పాము వెనుకాలేవెళ్లి దానిని పట్టుకున్నాడు. అది బుసలు కొడుతున్నా భయపడకుండా పాము తల కింద భాగంలో నోటితో కొరికడంతో పాము మృతిచెందినట్లు దీపక్ తెలిపాడు.]

ఇక్కడ విచిత్రమేమిటంటే.. దీపక్‌ను కాటేసినప్పటికీ అతని శరీరంపై పాముకాటు ప్రభావం చూపలేదు. తమ్ముడికి పాము కరిచిందన్న విషయాన్ని తెలుసుకున్న అక్క కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు దీపక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం దీపక్ పూర్తిగా కోలుకున్నాడు. పాము కాటేసినా విషం ప్రభావం చూపదనే మూఢనమ్మకం జష్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉంది. ఛత్తీస్‌గఢ్‌కు చివరన ఉన్న జష్‌పూర్ జిల్లాలోని ఫర్సాబహార్ తహసీల్దార్ పరిధి ప్రాంతాలను నాగాలోక్ అని పిలుస్తారు. కింగ్ కోబ్రా వంటి చాలా విషపూరితమైన పాములు ఛత్తీష్‌గఢ్ ఒడిశా రాష్ట్రాన్ని కలిపే రాష్ట్ర హైవే వెంబడి ఉన్న తప్కారా, దాని చుట్టుపక్కల గ్రామాలలో కనిపిస్తాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *