వాముతో మధుమేహానికి చెక్, రోజూ ఇలా తీసుకోండి చాలు

ప్రతి కిచెన్‌లో సర్వ సాధారణంగా కన్పించే వాముతో కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాముతో బరువు ఒక్కటే కాదు..మధుమేహాన్ని కూడా తగ్గించవచ్చు.

ఏ ఆహారపదార్థాలలో  అయినా వాము దినుసులు కాస్త కలిపితే చాలు ఆ ఆహార పదార్థానికి రుచి, సుగంధము అదనంగా చేరుతాయి. అది వాము ప్రత్యేకత. పచ్చిమిరపకాయలను మధ్యలోకి చీల్చి కాస్త ఉప్పు కలిపిన వామును కూరి నిమ్మకాయ రసాన్ని పిండి తీసుకుంటే ఆ రుచిని మాటల్లో చెప్పలేము. వాము జీర్ణశక్తిని  పెంచేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. వాము దినుసులను ఆకలిని పెంచి కడుపులో దోషాలను పోగొట్టే ఒక గొప్ప ఔషధంగా చెబుతారు ఆయుర్వేదఆయుర్వేద నిపుణులు.

వాము, ఇందులో తైమాల్ అనే  అటువంటి ఒక నూనె పదార్థం ఉంటుంది. ఈ పదార్థం మూలంగా దీనికి ఔషధ గుణాలు ఉంటాయి. వాము ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఆ వివరాలు మీ కోసం..

వాము అనేది ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. సాధారణంగా జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు వామును వినియోగిస్తుంటారు. అయితే వాముతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వాములో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ

గుణాలున్నాయి. వామును అధిక బరువుకు చెక్ పెట్టేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే వాముతో మధుమేహం కూడా తగ్గించవచ్చు. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు వాము అద్భుతంగా ఉపయోగపడుతుంది.

డయాబెటిస్ రోగులు వాము తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే వాములో పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అనేది రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించడంలో దోహదపడుతుంది. మీ డైట్‌లో వాము చేర్చడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు.

వాములో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున..బరువు సమస్య నుంచి

ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ మీరు డయాబెటిక్ రోగి అయితే..వాము లేదా అజ్వైన్ తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. డయాబటిస్ ఉన్నప్పుడు బాడీ మెటబోలిజం సరిగ్గా ఉండదు. మెటబోలిజం వేగం తగ్గితే..బరువు పెరుగుతారు. వాము సహాయంతో మెటబోలిజం వృద్ధి చెందుతుంది.

వాము అజీర్తి బాధలకు, జీర్ణ మండలంలో  సమస్యలకు బాగా పని చేస్తుంది. వాము పువ్వుల్ని పావు గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగితే కడుపులో నులు నొప్పి, గ్యాస్ తగ్గిపోతాయి. అజీర్తి, విరేచనాలు, నీళ్ల విరేచనాలు తగ్గుముఖం పడతాయి. పళ్ళకు, చిగుళ్ళకు వాము పొడిని పట్టిస్తే చిగుళ్లు గట్టిపడతాయి. పంటి పోటు తగ్గుతుంది. మనలో వాత, కఫ దోషాలను పోగొడుతుంది.  ధనియాలు, వాము సమానంగా కలిపి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి తింటే వేడి తగ్గుతుంది. శరీరంలో జీర్ణ శక్తి పెరుగుతుంది. నులి పురుగులు ఇట్టే తగ్గిపోతాయి. ముక్కు దిబ్బడ  వేసినప్పుడు వాము పొడిని వాసన చూస్తే  దిబ్బడ వదులుతుంది. టీ బి, న్యూమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు  వాముని చక్కటి చికిత్స గా చెబుతారు నిపుణులు.

వాము ఎలా తీసుకోవాలి

వామును ప్రతిరోజూ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. ఒక కప్పు నీళ్లలో ఒక స్పూన్ వాము వేసి ఉడికించాలి. ఆ తరువాత వడపోసి..భోజనం చేసిన 40 నిమిషాల తరువాత తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి.

గుండెజబ్బులు, క్యాన్సర్ తో బాధపడే వారికి కూడా వాము ఎంతో మేలు చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి, సోరియాసిస్  లాంటి వ్యాధులకు ఇది గొప్ప ఔషధం.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *