రుచికరమైన భోజనం అంటే అందులో సరిపడినంత ఉప్పు ఉండాలి. కానీ ఒక్కోసారి ఉప్పు తగ్గుతుంది. అయినా అలా తినేయకుండా పక్కనున్న ఉప్పు డబ్బా తీసి కూరల్లో, అన్నంలో వేసుకుని కలుపుకుని తింటారు.
ఇలా అదనంగా వేసుకున్న ఉప్పే ప్రాణాల మీదకు తెస్తోంది. వంటల్లో ఉప్పు తక్కువైనా సర్దుకుపోయి తినేయడం మంచిది. కానీ ఇలా పచ్చి ఉప్పును అన్నంపై, కూరపై చల్లుకుని తినకూడదు. నాలిక రుచి కోసం చూసుకుంటే, మీ గుండె ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే భోజనం తినేటప్పుడు ఉప్పు డబ్బాను దగ్గర్లో ఉంచుకోకండి. పెరుగన్నంలో కూడా ఉప్పు లేకుండా తినేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి వ్యాధుల బాధలు లేకుండా జీవించనంత కాలం ప్రశాంతంగా ఉంటారు
లేదు, ఉప్పు మీకు చెడ్డది కాదు మరియు ఉప్పును నివారించడం నిజంగా పెద్ద తప్పు. నిజానికి, ప్రముఖ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ జేమ్స్ డినికోలాంటోనియో ప్రకారం, “మన దేశం యొక్క దీర్ఘకాలిక వ్యాధుల సంక్షోభాలకు కారణం కాకుండా ఉప్పు ఒక పరిష్కారం కావచ్చు.”
సరైన మొత్తంలో ఉప్పు తినడం-మరింత ఖచ్చితంగా, అవసరమైన ఖనిజ సోడియం-అనేక కారణాల వల్ల ముఖ్యమైనది.
ఇది ఫలితం
బ్రిటన్లో ఇలా అదనంగా ఉప్పు వేసుకునే వారిపై అధ్యయనం నిర్వహించారు. దాదాపు 1,76,750 మందిపై అధ్యయనం నిర్వహించారు. వీరిలో అదనంగా అన్నంలో ఉప్పు వేసుకుని కలుపుకుని తింటున్న ఏడు వేల మందికి గుండె పోటు వచ్చినట్టు తేలింది. అలాగే మరో రెండు వేల మంది పక్షవాతం బారిన పడినట్టు గుర్తించారు. వండేటప్పుడు కాకుండా తినేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకున వారిలో గుండె జబ్బులు, అధికరక్త పోటు అధికంగా ఉన్నట్టు చెప్పారు పరిశోధకులు.
ఎంత తినాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు అయిదు గ్రాముల ఉప్పుకు మించి తినకూడదు. కానీ మనం అంతకు మూడింతలు తింటున్నాం. ఒక సర్వే ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు పది గ్రాముల ఉప్పు తింటున్నట్టు తేలింది. ఉప్పులో సోడియం 40 శాతం, క్లోరిన్ 60 శాతం ఉంటాయి. సోడియం అధికంగా రక్తంలో చేరడం వల్ల నీటిని అధికంగా ఆకర్షిస్తుంది. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది.
ఉప్పును తక్కువగా తినే డ్యాష్ డైట్ ను అందరూ పాటిస్తే మంచిది. అధిక రక్తపోటును ఆపేందుకు దీన్ని తయారుచేశారు. ఇందులో పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలు తినడం తగ్గిస్తారు. పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం అధికంగా తింటారు.