ఎంత పెద్ద గాయాలైనా ఇక చిటికెలో మాయం.. కొత్త టెక్నాలజీ వచ్చేసింది

సాధారణంగా ఎముకలకు గాయాలైతే వాటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని వారాలు, నెలలు పట్టొచ్చు. గాయం తీవ్రతను బట్టి కోలుకునే సమయం ఆధారపడి ఉంటుంది.

ఎముకలు తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి మరికొంత కాలం పడుతుంది. గాయం ఎప్పుడు మానుతుందా? అని ఆలోచిస్తుంటాం. త్వరగా నయమైతే బాగుంటుంది కదా అని భావిస్తుంటాం. అయితే, ఇకపై అలాంటి చింత అక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి నెలల పాటు వేచి ఉండక్కర్లేదని సూచిస్తున్నారు.

బెంగుళూరుకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  పరిశోధకులు ఓ నూతన టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఎముకలు త్వరగా వృద్ధి చెంది తక్కువ సమయంలో కోలుకునేందుకు సహాయపడేలా ఈ టెక్నాలజీని తీర్చిదిద్దారు. ఈ సాంకేతికతతో బాధితులు గాయాల బెడద నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు వారు చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చినట్లు వెల్లడించారు. మరి ఈ పరిశోధకులు చేసిన పరిశోధన ఏంటి? అదెలా పనిచేస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

  • అమెజాన్ .. ఇక ఆఫర్లే ఆఫర్లు.. ఎప్పటి నుంచంటే?

* బోన్‌ సెల్స్‌ అభివృద్ధి

ప్రయోగశాలలో బోన్ సెల్స్‌ని పెంచేందుకు అనువైన ఓ కల్చర్ ప్లేట్‌పై పరిశోధకులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సాధారణంగానే మానవుని శరీరంలో ఉత్పత్తయ్యే విద్యుత్ తరంగాలు కణాలను వృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే. ఈ టెక్నిక్‌ని ఉపయోగించి ప్రయోగశాలలో బోన్ సెల్స్‌పై పరిశోధకులు ‘ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్’ పద్ధతిని ప్రయోగించి చూశారు. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ ప్రయోగం ద్వారా బోన్ సెల్స్ త్వరగా వృద్ధి చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఈ ప్రయోగం నాంది పలికిందని వారు వెల్లడించారు.

* పియజో ఎలక్ట్రిక్ స్వభావం కీలకం

మానవుని ఎముకలు ‘పియజో ఎలక్ట్రిక్’ స్వభావాన్ని కలిగి ఉండటమే ఈ ప్రయోగానికి బీజం వేసిందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో సాధారణంగా ఎముకలపై ఏదైనా ఒత్తిడి లేదా భారం కలిగినప్పుడు.. అవి విద్యుత్ తరంగాలను పోగు చేసుకుంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ విద్యుత్ తరంగాలు పరోక్షంగా ఎముక కణాల వృద్ధికి, పెరుగుదలకు దోహదపడతాయని చెప్పారు. బోన్ సెల్స్ మెంబ్రేన్‌లు కాల్షియం అయాన్‌లను స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఛానళ్లను కలిగి ఉంటాయని, ఈ బోన్ సెల్స్‌కి కాల్షియం కణాలు అందడం ద్వారా పిల్ల కణాలుగా విడిపోతాయని పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా కేవలం శరీరంలో సాధారణంగా జరిగే ప్రక్రియ అని తెలిపారు

బోన్ సెల్స్‌కి ఉండే ఛానళ్లు కాల్షియం అయాన్‌ల ప్రవాహంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పరిశోధకులు బాహ్య ఎలక్ట్రిక్ క్షేత్రం ఏర్పాటు ద్వారా ఈ ఛానళ్లను మరింత క్రియాశీలకం చేశారు. సాధారణం కన్నా మరిన్ని కాల్షియం అయాన్‌లను కణానికి పంపించే విధంగా ఛానళ్లకు ఉద్దీపన కలిగించారు. దీంతో బోన్ కణాలు త్వరత్వరగా పిల్ల కణాలుగా విడిపోతున్నాయి. ఫలితంగా ఎముకలు త్వరగా వృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. అయితే, ఇలా ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్‌ని ఉపయోగించుకునే ఒక టూల్‌ని పరిశోధకులు తయారు చేశారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ద్వారా గాయాల నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు బాట వేశారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *