ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఐఫోన్ 15 వచ్చేస్తోంది! ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఐఫోన్ లవర్స్ గుడ్ న్యూస్. యాపిల్ సంస్థ ఐ ఫోన్ 15 ఆల్ట్రాను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 వినియోగదారులను అంత సంతృప్తి పరచలేదు.

అంతకు ముందు మోడల్ కు దీనికి పెద్దగా వేరియేషన్ లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందారు. ఇప్పుడు దానికి అప్ గ్రేడ్ వెర్షన్ గా ఐఫోన్ 15 ఆల్ట్రాను తీసుకొస్తోంది. దీని ధర ఇంకా నిర్ధారణ కాలేదు.

రేట్ ఫిక్స్ అయ్యిందా?

కొన్ని సోర్సెస్ ప్రకారం ఐఫోన్ 14 కన్నా 200 డాలర్లు అధికంగా కొత్త ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క ఫోన్ ధర 1,299 డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 1,07,330 గా ఉంటుంది. ఈ ధర ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ప్రో మ్యాక్స్ అమెరికాలో 1,099 డాలర్లు కాగా దానిని ఇండియాలో రూ. 1,39,900లకు విక్రయించారు.

వాస్తవానికి 1,099 డాలర్లంటే 90,810 రూపాయలు మాత్రమే. దీనికి కస్టమ్ డ్యూటీ చార్జ్ కలిపితే రేటు పెరుగుతుంది.

అమెరికాలో అత్యంత ఖరీదైన ఫోన్ ఇదే.

ఏటా ఫోన్ తయారీకి కావాల్సిన ముడి సరుకు ధరలు గణనీయంగా పెరగడం. ద్రవ్యోల్భణం కూడా ప్రభావం చూపుతుండటంతో ఐఫోన్ ధరలు పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అందిన సొర్సెస్ ప్రకారం ఈ ధరలే గనుక నిజమైతే అమెరికాలో ఈ ఐఫోన్ 15 మోడల్ అత్యంత ఖరీదైన ఫోన్ గా నిలవనుంది.

అత్యాధునిక ఫీచర్స్.

ఐఫోన్14 లో పెద్దగా మార్పులు చేయకపోవడంతో వినియోగదారులకు అది పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో రానున్న 15 మోడల్లో పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు సొర్సెస్ ద్వారా తెలుస్తోంది. లేటెస్ట్ మోడల్ లో కెమెరా మొదలు ప్రాసెసర్ వరకు అన్ని అత్యాధునిక ఫీచర్లను జోడించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *