ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే.. శరీరంలో ఏం మార్పులు జరుగుతాయో తెలుసా..?

మన శరీరానికి ఆహారంతో పాటు నీరు కూడా ఎంతో అవసరం. మన శరీరంలో జరిగే జీవక్రియల్లో నీరు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

నీరు లేని మానవ మనుగడను ఊహించడమే చాలా కష్టం. అయితే చాలా మంది చలికాలం, వర్షాకాలంలో అసలు నీటినే తాగరు. చల్లటి నీటినే అస్సలే తాగరు. వేసవి కాలంలో మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకుని మరీ తాగుతారు. అసలు చల్లటి నీరు, వేడి నీరు వీటిలో ఏది తాగితే మంచిదో దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల ప్రకారం నీటిని వేడి చేసుకుని తాగడమే చాలా మంచిదని తేలింది. ఈ వేడి నీటిని కూడా ఎప్పుడు ఎందుకు తాగాలో అన్న విషయాలను కూడా వారు తెలియజేసారు.

ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ ఇలా గోరు వెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే నీరసం, శ్వాస సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఇలా ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాయామాలు చేసినప్పుడు, జిమ్ కి వెళ్లి వర్క్ అవుట్స్ చేసినప్పుడు శరీరం బాగా వేడెక్కుతుంది. చెమలు బాగా బయటకు వస్తూ ఉంటాయి.

అలాంటప్పుడు చల్లటి నీటిని తాగడం ఉత్తమమని వారు చెబుతున్నారు. వేసవి కాలంలో ఎండలు ఎలా మండుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కాబట్టి ఎండకు బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఒక గ్లాస్ చల్లటి నీటిని తాగడం ఉత్తమం. అలాగే అన్నం తినేటప్పుడు చల్లని నీటిని తాగడం వల్ల శరీరం వేడికి గురిఅవుతుందని జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి నీటి కంటే వేడి నీటిని తాగడమే ఉత్తమం అని రక్తప్రసరణ, జీర్ణక్రియ బాగా జరుగుతాయని సూచించారు. బయట ఎండకు తిరిగి వచ్చినప్పుడు చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. చాలా మంది ఉదయాన్నే టీ, కాఫీ వంటివి తాగుతారు.

వాటికి బదులుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మలో ఉండే ఆల్కలైన్ లక్షణాలు శరీరంలో ఉండే వ్యర్థపదార్థాలను బయటకు పంపించడంలో మంచి సాధనంగా పని చేస్తాయి. నిమ్మ ఆసిడిక్ గా అనిపించినప్పటికి దీనిలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పి హెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. నిమ్మకాయలో ఉండే ఒక ప్రత్యేకమైన పీచు పదార్థం బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరగడంతో పాటు ఆకలి కూడా అదుపులో ఉంటుంది. ఉదయాన్నే ఒక గ్లాస్ నిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఖాళీ అయ్యి ప్రశాంతతను కలిగిస్తుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *