ఓటీటీ విడుదలకి సిద్ధమైన మెగాస్టార్ సినిమా గాఢ్ ఫాదర్!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

ఓటీటీ విడుదలకి సిద్ధమైన మెగాస్టార్ సినిమా గాఢ్ ఫాదర్!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గాఢ్ ఫాదర్’ (Godfather). చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబరు 5న రిలీజైన ఈ మూవీ హిట్‌ టాక్‌తో థియేటర్లలో సందడి చేసింది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ ‘గాడ్‌ఫాదర్’ మూవీలో సల్మాన్ ఖాన్‌‌తో పాటు సత్యదేవ్, నయనతార, సముద్ర ఖని, సునీల్, షఫీ తదితరులు నటించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

మలయాళంలో బ్లాక్‌బాస్టర్‌ హిట్ గా నిలిచిన ‘లూసిఫర్‌’కి ఇది రీమేక్. అయినప్పటికీ.. ఈ మేరకు నెట్‌ప్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి గాడ్‌ఫాదర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్లపరంగా మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.

తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సీనియర్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఓ పాత్ర పోషించారు.

ఇప్పటి వరకు ఎక్కువగా అంతర్జాతీయ కంటెంట్ మీద ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేసిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘గాడ్‌ ఫాదర్‌’ హక్కులను సొంతం చేసుకుంది.

అందుకే త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకులకి అందుబాటులోకి తెచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోందట.

గాడ్‌ఫాదర్’ ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.56 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 19 నుంచి నెట్‌ప్లిక్స్‌లో గాడ్‌ఫాదర్ స్ట్రీమింగ్‌ కానుంది.  ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్‌ని లాక్ చేసిన నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని అందుబాటులోకి తెచ్చేందుకు వినిపిస్తోంది. అంతేకాకుండా.. త్వరలోనే దీని గురించి సోషల్ మీడియా వేదిక అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సూపర్ హిట్ మూవీ సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటించడం హిందీలో ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *