చంద్రున్ని చుట్టేసి సురక్షితంగా భూమికి చేరిన నాసా ఒరైన్ స్పేస్ షిప్;

చంద్రున్ని చుట్టేసి సురక్షితంగా భూమికి చేరిన నాసా ఒరైన్ స్పేస్ షిప్;

చంద్రున్ని చుట్టేసిన నాసా ఒరైన్ స్పేస్ షిప్ విజయవంతంగా భూమి మీద దిగింది.

26 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా భూమికి చేరింది ఒరైన్ క్యాప్సుల్. భూమి వాతావరణంలోకి అత్యంత వేగంగా ప్రవేశించిన ఒరైన్, పారాచూట్ సాయంతో పసిఫిక్ మహా సముద్రంలో క్షేమంగా దిగింది.

పనితీరును పరీక్షించడంలో భాగంగా చంద్రుని వద్దకు ఒరైన్‌ను పంపారు కాబట్టి ఇందులో మనుషులు ఎవరూ ప్రయాణించలేదు. రాబోయే రోజుల్లో ఇది ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుని మీదకు తీసుకెళ్తుంది.

2024 చివర్లో లేదా 2025, 2026లలో మరొకసారి మనుషులను చంద్రుని మీదకు పంపాలని నాసా భావిస్తోంది. సరిగ్గా 50ఏళ్ల కిందట ఇదే రోజు అపోలో-17 ద్వారా ఆస్ట్రోనాట్స్ చంద్రుని మీద దిగారు.

నాసా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పేరు ఆర్టెమిస్. గ్రీకు పురణాల ప్రకారం ఆర్టెమిస్ అనేది అపోలో సోదరి.

‘(అపోలో అప్పుడు) మేం అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాం. ఇపుడు మరొకసారి చంద్రుని మీదకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. కానీ, ఈసారి అవసరం వేరు.

జీవించడం నేర్చుకోవడానికి, పని చేయడానికి, ఆవిష్కరణలు చేయడానికి, కొత్తవాటిని సృష్టించడానికి వెళ్తున్నాం. చంద్రున్ని ఆధారంగా చేసుకుని విశ్వాన్ని మరింత అన్వేషించడానికి పోతున్నాం.

2030 చివరి నాటికి అంగారకుని మీదకు మానవులను తీసుకెళ్లడానికి సిద్ధం కావాలన్నది మా ఆలోచన. అంగారకున్ని దాటి కూడా మేం వెళ్లాలని భావిస్తున్నాం’ అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మీడియాతో అన్నారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *