ట్రెండింగ్ స్టాక్ … ఇన్వెస్టర్లకు డబ్బులే డబ్బులు.. భారీ లాభాలు..
ఇటీవల రికార్డు గరిష్టాలకు పెరిగిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గరిష్ట విలువల వద్ద అమ్మకాల ఒత్తిడితి అనిశ్చిత ప పరిస్థితుల మధ్య ట్రేడింగ్ చేస్తున్నాయి. కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఫ్లాట్‌గా, లేదంటే నష్టాల్లో ఉంటున్నాయి. ఈ వార్త రాసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు కోల్పోయింది. 61 వేల 170 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ కూడా 130 పాయింట్లకుపైగా కోల్పోయి.. 18 వేల 170 మార్కు వద్ద ఉంది. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ పతనమైంది. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ అత్యధికంగా నష్టపోయింది. బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ రాణిస్తుండగా.. ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ మాత్రం పడిపోయాయి.
అయితే గరిష్ట విలువల వద్ద మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ అక్కడ పెద్ద పెద్ద షేర్లకు ఇప్పటికీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా SKF ఇండియా స్టాక్ గురించి చెప్పుకోవాలి. ఇవాళ మార్కెట్లు పడుతున్నా.. ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ఇండస్ట్రీకి సంబంధించి బేరింగ్స్, మెచైనరీ విడిభాగాలను తయారుచేసి, విక్రయించే వ్యాపారం చేస్తుంది ఎస్‌కేఎఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. ఇటీవల కాలంలో ఈ ప్రొడక్ట్స్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. దాంతో షేరు దూసుకెళ్తోంది.
టెక్నికల్ పారామీటర్స్ చూసుకుంటే గనుక.. ఈ స్టాక్ 10 వారాల కప్ ప్యాట్రన్ ప్రకారం మంచి వాల్యుమ్స్‌తో ట్రేడవుతోంది. ప్రస్తుతం 52 వారాల గరిష్ట విలువల వద్ద ఉందీ skf ఇండియా షేరు. మూవింగ్ యావరేజెస్‌ను చూసుకుంటే కూడా మంచి అప్‌ట్రెండ్‌లో కనిపిస్తోంది. RSI 71.22గా ఉండి.. స్ట్రాంగ్ స్ట్రెంత్‌ను సూచిస్తోంది. ADX కూడా 30.03 వద్ద మంచి స్థాయిలోనే ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ స్టాక్ 35 శాతం లాభాలను అందించింది. ప్రస్తుతం NSEలో రూ.5100 లెవెల్స్‌లో ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌పై దృష్టి పెడితే మంచిది. సుదీర్ఘ కాలంలో భారీ లాభాలు ఆర్జించొచ్చు