సరికొత్త స్టైల్‌లో మళ్లీ మార్కెట్‌లోకి రానున్న టాటా నానో.. ఫీచర్స్‌, ధర విషయానికొస్తే..!

సరికొత్త స్టైల్‌లో మళ్లీ మార్కెట్‌లోకి రానున్న టాటా నానో.. ఫీచర్స్‌, ధర విషయానికొస్తే..!

ప్రముఖ ఇండియన్‌ వ్యాపార దిగ్గజం రతన్ టాటా  ఏం చేసిన అదో ట్రెండ్‌ సెట్టర్‌. గతంలో సామాన్యుల కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో రూ.లక్ష రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు.

2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేసింది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే,టాటా నానో కారు మళ్లీ వచ్చేస్తుందని,ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుందని, అదికూడా ఎలక్ట్రిక్ మోడల్స్ విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతోపాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ డ్రీమ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అయిన టాటా నానో 2025 నాటికి  మార్కెట్ లో రానున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే, 2025 నాటికి భారతదేశంలో నానో మరో శకం ప్రారంభమవుతుందని అంచనా.

టాటా నానో EV ఫీచర్లు ;

ఈ టాటా నానో EV కార్‌ , 72v లిథియం- అయాన్ బ్యాటరీ ఫీచర్లను టాటా నానోలో జోడిస్తారని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ ద్వారా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉండనుంది. కేవలం 10 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని చెబుతున్నారు. అలాగే.. ఈ సరికొత్త టాటా నానో కనీస ధర రూ.2-3 లక్షల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *