మీ కాలర్ ID కనిపించకుండా కాల్ చేయాలనుంటున్నారా? జస్ట్, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి;

మీ కాలర్ ID కనిపించకుండా కాల్ చేయాలనుంటున్నారా? జస్ట్, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి;

ప్రస్తుతం విరివిగా అందుబాటులో ఉన్న యాప్స్ ద్వారా తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే, ఎవరు చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంది.

కానీ, ప్రైవసీని మెయింటెయిన్ చేయాలి అనుకునే వ్యక్తులు కాలర్ ఐడీ తెలియకుండా ఉండాలని భావిస్తారు. అలాంటి వారు కేవలం మూడంటే మూడు స్టెప్స్ ద్వారా కాలర్ ఐడీని కనిపించకుండా చేసుకునే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

> కాల్    చేయాలనుకుంటున్న నంబర్ కు ముందు *67తోడయల్చేయండి:

 

మీరు కాల్ చేయాలనుకుంటున్న ఫోన్ నంబర్ కు ముందు *67కు డయల్ చేయడం ద్వారా మీ నంబర్‌ను బ్లాక్ చేయడం ఈజీ అవుతుంది. మీ కాంటాక్ట్‌లలో సేవ్ చేసిన వారికి కూడా మీ కాలర్ ID కనిపించకుండా ఉండాలంటే, ముందుగా వారి నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ యాప్‌లో మాన్యువల్‌గా టైప్ చేసి దానికి ముందు *67 యాడ్ చేయాలి. ఉదాహరణకు, మీరు 555-555-5555కి కాల్ చేస్తున్నప్పుడు, మీ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయాలనుకుంటే, *67-555-555-5555కి డయల్ చేయాలి. మీరు ఎవరికైనా కాల్ చేయడానికి *67ని ఉపయోగించినప్పుడు ఎదుటి వారి ఫోన్ లో మీ కాలర్ ఐడీ కనిపించదు.

> ఫోన్లో కాలర్ ID సెట్టింగ్లను మార్చండి:

 

మీ ఫోన్ లో సెట్టింగ్‌లను మార్చడం ద్వారా కూడా మీ కాలర్ ఐడీని కనిపించకుండా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, iOS ఫోన్లలోనూ మీ కాలర్ IDని కనిపించకుండా దాచుకునే అవకాశం ఉంది. సెట్టింగ్‌లను మార్చిన తర్వాత మీ నంబర్‌ను తాత్కాలికంగా కనిపించేలా చేయాలనుకుంటే, మీరు కాల్ చేయాలనుకుంటున్న నంబర్‌కు ముందు *82 డయల్ చేయండి. మీ కాలర్ IDని మళ్లీ చూపిస్తుంది. ఐఫోన్ లో మీ కాలర్ IDని బ్లాక్ చేయడానికి ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఫోన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కింది స్ర్కోల్ చేయాలి. మై కాలర్ ఐడిని నొక్కాలి. మీ ఐడీని కనిపించకుండా చేసేందుకు టోగుల్ ఆఫ్ చేయాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో డయలర్ యాప్‌ని బట్టి, ఈ ప్రక్రియ కాస్త డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంది. ముందు మీ ఫోన్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సప్లిమెంటరీ సర్వీసెస్‌కి క్రిందికి స్క్రోల్ చేయాలి. కాల్స్ > అదనపు సెట్టింగ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మై కాలర్ IDని నొక్కాలి. పాప్అప్ మెను నుంచి నంబర్‌ను హైడ్ చేసే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

 

>సెల్ క్యారియర్‌తోనే నేరుగా మీకాలర్ IDని బ్లాక్చేయండి:

మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లలో మీ నంబర్‌ను బ్లాక్ చేయడానికి లేదా మీ కాలర్ IDని దాచడానికి ఎంపికను గుర్తించలేకపోతే, మీరు నేరుగా మీ సెల్ క్యారియర్‌తోనే బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇలా చేయడం మూలంగా అన్ని కాల్స్ కు మీ కాలర్ ఐడి కనిపించకుండా ఉంటుంది. ఒకవేళ నిర్దిష్ట కాల్ కోసం మీ ఫోన్ నంబర్‌ను చూపించాలనుకుంటే, మీరు నంబర్ ప్రారంభంలో

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *