లక్షను రూ.65 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. ఇన్వెస్టర్లపై కనకవర్షం.. మీ దగ్గరుందా మరి?

లక్షను రూ.65 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. ఇన్వెస్టర్లపై కనకవర్షం.. మీ దగ్గరుందా మరి?

మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ కాలంలోనే దాని అసలు విలువకు ఎన్నో రెట్లు పెరిగే ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లను లక్షాధికారుల్ని చేస్తాయి. అయితే మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను గుర్తించడమే కాస్త కష్టం. చాలా వరకు అవి గరిష్ట విలువకు చేరాకే అది మల్టీబ్యాగర్ స్టాక్ అని మనం గ్రహించగలుగుతాం. అయితే.. మార్కెట్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. కంపెనీల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటే మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను తెలుసుకోవడం పెద్ద కష్టమైతే కాకపోవచ్చు. తద్వారా మంచి లాభాలను సాధించొచ్చు. అయితే మార్కెట్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. కరోనా సమయంలో భారీగా పడిపోయిన మార్కెట్లు ఇటీవలి కాలంలో మళ్లీ కోలుకున్నాయి. ప్రస్తుతం హెచ్చుతగ్గుల్లో కొనసాగుతున్నాయి.

అయితే సన్మిత్ ఇన్‌ఫ్రా అనే ఒక కంపెనీ.. పెన్నీ స్టాక్ నుంచి మల్టీబ్యాగర్ స్టాక్‌గా అవతరించింది. అది కూడా అతి తక్కువ కాలంలోనే కావడం విశేషం. నాలుగేళ్లలో ఏకంగా 5,365 శాతం రిటర్న్స్ అందించింది. స్టాక్ స్ప్లిట్‌తో షేర్‌హోల్డర్లు పండగ చేసుకున్నారు. దీంతో ఒక్క షేరుకు.. 10 షేర్లు వచ్చాయి. ఫేస్ వాల్యూ రూ.10 నుంచి రూ.1కి పడింది. 2022 అక్టోబర్ 31న ఈ స్టాక్ ఎక్స్ స్ప్లిట్ అయింది. 2022 నవంబర్ 17న ఈ స్టాక్ ఆల్ టైం హైకి చేరింది. రూ.85.70 దీని 52 వారాల గరిష్ట విలువ. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.73 లెవెల్స్ వద్ద ట్రేడవుతోంది.

గత వారం నుంచి చూసుకుంటే ఈ స్టాక్ ఏకంగా 15 నుం 20 శాతం మేర పెరిగింది. గత 6 నెలల్లో ఏకంగా 75 శాతం పెరిగింది. ఇక ఈ సంవత్సరంలో చూసుకుంటే మాత్రం 140 శాతం లాభాలు వచ్చాయి. ఐదేళ్లలో ఏకంగా 5,365 శాతం రిటర్న్స్ వచ్చాయి.

దీంతో నాలుగేళ్ల కాలంలో సన్మిత్ ఇన్‌ఫ్రా స్టాక్ నాలుగేళ్లలో భారీగా లాభపడింది. 2018 డిసెంబర్ 21న ఈ స్టాక్ ధర రూ.1.31 వద్ద ఉంది. ఇప్పుడు రూ.85.70 కి చేరింది. అంటే ఈ లెక్కన నాలుగేళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడది ఏకంగా రూ.65 లక్షలకు చేరింది. అదే విధంగా గతేడాది ఇందులో పెట్టుబడి పెట్టినా.. అది మూడింతలు పెరిగి ఏకంగా 3 లక్షలకుపైగా లాభం వచ్చేది.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 18 వేల 244 వద్ద ముగిసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్ రాణించగా.. బీపీసీఎల్, నెస్లే, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా నష్టపోయాయి.

 

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *