అణుబాంబు వేసే టైమొచ్చింది.. అమెరికా మిత్రదేశాలకు పుతిన్ వార్నింగ్

 ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కీలక మలుపుతిరగబోతోంది. ఇప్పట్లో యుద్ధాన్ని ముగించేలా లేదు రష్యా.

తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు బుధవారం ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ భూభాగాల్లోకి మరిన్ని రష్యా బలగాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ లో ఉన్న పౌరులు, అన్నింటి కన్నా ముఖ్యంగా గతంలో సాయుధ బలగాల్లో పరిచేసిన, అనుభవం ఉన్నవారిని సమీకరించనున్నారు. రష్యాను బలహీన పరచాలని, విభజించాలని అనునకుంటున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. వెస్ట్రన్ దేశాల బెదిరింపులకు రష్యా దగ్గర సమాధానం ఉందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రష్యా దేశ సమగ్రతకు ముప్పు ఏర్పడితే.. మా ప్రజలను రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని ఆయన అన్నారు. మాకు ఓపిక నశించిందని.. అణుబాంబులు వేసే సమయం వచ్చిందని.. ఇదంతా డ్రామా అని అమెరికా దాని మిత్రదేశాలు అనుకుంటే పొరపాటే అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు పుతిన్. రష్యా దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయని.. ఉక్రెయిన్ ను నలువైపుల నుంచి ముట్టడించేంకు 3 లక్షల సైన్యాన్ని పంపిస్తున్నట్లు వెల్లడించారు.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత మొదటిసారిగా పాక్షిక సైనిక సమీకరణకు రష్యా పిలుపునిచ్చింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లోని లుహాన్స్క్‌, దొనెట్స్క్ ప్రావిన్స్‌లు, ఖేర్సన్‌, జపోరిజ్జియా ప్రాంతాలను శాశ్వతంగా రష్యాలో అంతర్భాగాలుగా చేసుకునేందుకు పుతిన్‌ సర్కారు రంగం సిద్ధం చేసింది. దీని కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని రష్యా యోచిస్తోంది. ఈ ప్రకటన వెలువడిన ఒక రోజు తర్వాత పుతిన్ పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని బలగాలు ఉక్రెయిన్ పోరాటంలో చేరే అవకాశం ఏర్పడింది..

కాంగ్రెస్ లో అయోమయం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారైనా.. పోటీచేసేది ఎవరు.. ఎన్నికయ్యేదెవరనే అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓవైపు పీసీసీలు రాహుల్ పై ఒత్తిడి పెంచుతుండగా..

మరోవైపు శశి థరూర్, అశోక గెహ్లాట్ పేర్లు కూడా వినిపిస్తుండటం.. గందరగోళంగా మారింది. అసలు కాంగ్రెస్ అధిష్ఠానానికైనా క్లారిటీ ఉందా..? అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తోందా..?

రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సిద్ధమవుతోంది. ఓవైపు అధ్యక్ష పదవికి పోటీ చేసే ఉద్దేశం ఉందని శశిథరూర్‌ పేర్కొనడం, మరోవైపు అశోక్‌ గహ్లోత్‌ వంటి సీనియర్‌ నేతలు పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత మరింత మంది పోటీలో నిలబడే సూచనలు కనిపిస్తుండడంతో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా అనివార్యంగా కనిపిస్తోంది. అయితే చివరకు రాహుల్ కే అధ్యక్ష పదవి కట్టబెడతారనే వాదన కూడా వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సోనియా కుటుంబాన్ని కీర్తిస్తూ, గాంధీ కుటుంబం పట్ల విధేయత ప్రకటిస్తూ.. జన రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా మనగలుగుతున్న నేతలకు.. కాంగ్రెస్‌ను కేవలం గాంధీ కుటుంబ ఆస్తిగా మాత్రమే కాకుండా ఒక పార్టీగా కూడా చూస్తున్న తిరుగుబాటు రాజకీయ నాయకులకు మధ్య ఇప్పుడు పోరాటం జరగబోతోంది. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్‌పధ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి శశి థరూర్ పోటీ చేస్తారనే సంకేతాలు వెల్లడైనా ఆయన బాహాటంగా అధ్యక్ష పదవి రేసులో వెల్లడించలేదు. శశి థరూర్ పార్టీలో అసంతృప్త నేతలుగా గుర్తింపు పొందిన జీ23 నేతలతో లేకున్నా పార్టీలో సంస్కరణలకు అనుకూలంగా చాలాసార్లు మాట్లాడారు. పార్టీని సంస్ధాగతంగా ప్రక్షాళన చేయాలని అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని జీ23 నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2019లో రాహుల్ గాంధీ

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.

కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష పదవికి చివరిసారిగా నవంబర్‌ 2000లో ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన జితేంద్ర ప్రసాద.. సోనియా గాంధీ చేతిలో ఓటమిపాలయ్యారు. అంతకుముందు 1997లో జరిగిన ఎన్నికల్లో శరద్‌ పవార్‌, రాజేష్‌ పైలట్‌లను సీతారాం కేసరి ఓడించారు. అనంతరం 1998 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిలో సోనియా గాంధీనే కొనసాగుతున్నారు. 2017-19 మినహా ఆ పదవిని సుదీర్ఘకాలంపాటు చేపట్టిన వ్యక్తిగా సోనియా గుర్తింపు పొందారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యంగా కనిపిస్తుండడంతో అధ్యక్ష బాధ్యతలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనే విషయంపై ఆసక్తి నెలకొంది.

పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను తటస్థంగా వ్యవహరిస్తానని, ఎక్కువమంది పోటీ చేయడాన్ని ఆహ్వానిస్తానని సోనియా గాంధీ చెబుతున్నారు. శశిథరూర్‌తో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎవరైనా పోటీపడవచ్చని, పార్టీ తరపున ఎవరి సమ్మతి అవసరం లేదంటూ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ కూడా స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ విముఖత చూపిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆయన ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి గాంధీ కుటుంబేతర వ్యక్తి అధినేత అయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ అధ్యక్ష పోటీపై తనకు ఆసక్తి ఉందని శశిథరూర్‌ ఇప్పటికే తన అభిప్రాయాన్ని స్పష్టం చేయగా.. ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్‌ నేత, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఐతే గహ్లోత్‌ మాత్రం.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేలా రాహుల్‌ గాంధీని ఒప్పించడమే తన మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు. ఐతే, పార్టీ పగ్గాలు అశోక్‌ గహ్లోత్‌కు అప్పజెప్పేందుకు అధిష్ఠానం సిద్ధంగానే ఉన్నప్పటికీ.. ఒకవేళ అది చేపడితే రాజస్థాన్‌ సీఎం పదవికి దూరం కావాల్సి వస్తుంది. దీంతో రాజస్థాన్‌ సీఎం పగ్గాలు తన ప్రత్యర్థి సచిన్‌ పైలట్‌ చేతిలోకి వెళ్లిపోతాయని గహ్లోత్‌ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో దేశరాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ నిర్వహణ బాధ్యతలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *