వేళకాని వేళలో నిద్రపోవడం వల్ల రాత్రి సరైన సమయానికి నిద్ర రాదు. తక్కువ సమయం నిద్రకీ టైప్ 2 డయాబెటీస్ కీ సంబంధం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి.
తక్కువ నిద్ర అనేది సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య మెదడును సరిగా పనిచేయనీదు. నిద్ర సరిగా లేని వారు రోజంతా గందరగోళంగా, చికాకుగా ఉంటారు. అంతే కాకుండా తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటులో హెచ్చుతగ్గులు, స్ట్రోక్, గుండె జబ్బులు, ఊబకాయం పెరగటంతో పాటు బరువు పెరగడంలోనూ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుదలలో కూాడా మార్పులు సంభవిస్తాయి.
రాత్రి సమయంలో నిద్ర పట్టక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉదయం అంతా పనిచేసి.. రాత్రి ప్రశాంతంగా పడుకుని మళ్లీ ఉదయం పనికి వెళ్దామని అంతా అనుకుంటారు. కాని అనుకున్నట్లుగా కొందరికి సుఖంగా నిద్ర పట్టదు. వాస్తవానికి ఆరోగ్యవంతమైన జీవితం కోసం..
ప్రతిరోజూ దాదాపు 7 నుంచి 8 గంటలకన్నా తక్కువ నిద్ర ఉన్నవారిలో గుండె సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఆరోగ్యకరమైన వారిలో కూడా ప్రీడయాబెటిస్కి కారణం కావచ్చు. దీనికి ప్రత్యమ్నాయంగా పగటి పూట నిద్రపోయే అలవాటును తగ్గించాలి. వేళకాని వేళలో
నిద్రపోవడం వల్ల రాత్రి సరైన సమయానికి నిద్ర రాదు. తక్కువ సమయం నిద్రకీ టైప్ 2 డయాబెటీస్ కీ సంబంధం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఆరోగ్యకరమైన నిద్ర అలవాటు లేకపోతే అది డిప్రెషన్ కి కారణం కావచ్చు.
రాత్రి సమయంలో కాఫీ టీలను మానేయాలి. వీటి వల్ల నిద్ర ఆలస్యం అవుతుంది. గోరువెచ్చని పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిద్ర సమయంలో ఎలాంటి పనిని పెట్టుకోకూడదు. ఉదయం లేచి చేయాల్సిన పనిని పదే పదే మనసులో అనుకోవడం వల్ల కూడా నిద్ర తగ్గుతుంది. దాని స్థానంలో ఒత్తిడి మొదలవుతుంది.
అంతే కాకుండా ఆల్కహాల్, సిగరెట్ వంటివి తీసుకున్నా కూడా నిద్ర సరైన సమయానికి రాదు. కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల నిద్ర సమయం తగ్గుతుంది. నిద్రరాని సమయాల్లో పాజిటివ్ ఆలోచనలు చేయండి. మృదువైన సంగీతాన్ని వినడం, నచ్చిన పుస్తకం చదవడం, రిలాక్స్ కావడం వల్ల చక్కని నిద్ర వస్తుంది. పడుకునే గదిలో పాజిటివ్ నెస్ ఉండేలా చూసుకోవాలి. నచ్చిన కలర్ కర్టెన్స్, దుప్పట్లు ఉండేట్టు చూసుకోవాలి. దిండ్లు మెత్తగా ఉండేలా, పరుపు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
పడుకునే ముందు పాలు తాగడం
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాలని వైద్యులు చెబుతున్నారు. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది పగటిపూట అలసట నుండి ఉపశమనం పొందడం ద్వారా మంచి నిద్రను పొందడంలో సహకరిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి పడుకునేముందు పాలు తీసుకోవడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు.
అరచేతులకు
రాత్రి పడుకునే ముందు అరికాళ్లను 2 నుంచి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరికాళ్ల ఆక్యుప్రెషర్ పాయింట్లపై నూనెను మసాజ్ చేయడం వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటుందని, మంచి నిద్రకు సహాయపడుతుంది.
కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు
నిద్రవేళకు ముందు రాత్రి భోజనంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. మెరుగైన జీర్ణక్రియ ఉండాలంటే రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. దీంతో చక్కటి నిద్ర పడుతుంది. మనం తినే ఆహారం మన నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
పడుకునే ముందు స్నానం
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇలా చేయడం వల్ల అలసట తొలగిపోయి, మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత రాత్రిపూట చాలా ప్రశాతంగా ఉంటుంది. సుఖంగా నిద్రపోవచ్చు.
వీటికి దూరంగా
రాత్రి పడుకునే ముందు ఫోన్, ల్యాప్‌టాప్, టీవీకి దూరంగా ఉండాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు కణాలకు విశ్రాంతి లభించడం వల్ల రాత్రి బాగా నిద్రపడుతుంది. మరుసటి రోజు ఎనర్జీతో నిద్ర లేవడానికి వీలవుతుంది.