ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లికేషన్‌ ప్రాసెస్‌, శాలరీ వివరాలు ఇవే..

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెస్టర్న్ రీజియన్‌లో వివిధ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.

ఏఏఐ భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు వేతనం రూ.1,10,000 వరకు లభిస్తుంది. ఇంతకీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే అర్హతలేంటి, దరఖాస్తు ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత? ఆఖరు తేదీ ఎప్పుడు? తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ రాష్ట్రాల వారు మాత్రమే అర్హులు

50 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీనికి మహారాష్ట్ర , గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు అర్హులు. అభ్యర్థులు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కెరీర్ పేజెస్‌లో వారు రిజిస్టర్ కావచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.1,000ని అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇతర కేటగిరీలకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ తేదీలను ఏఏఐ ఇంకా చెప్పలేదు.

పోస్టుల వివరాలు

ఖాళీ పోస్టులు మొత్తం 55 కాగా, ఇందులో 35 సీనియర్ కేటగిరీ పోస్టులు. వీటిలో 25 సీనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. 6 పోస్టులు అధికారిక భాషకు సంబంధించినవి, 4 ఆపరేషన్స్, 3 ఎలక్ట్రానిక్స్, మిగతా 12 ఫైనాన్స్ రిలేటెడ్. ఈ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పే స్కేల్ రూ.36,000 నుంచి రూ.1,10,000 మధ్య ఉంటుంది. 30 జూనియర్ అసిస్టెంట్ పోస్టులుండగా, ఇందులో 7 హ్యూమన్ రిసోర్స్ ఖాళీలు కాగా, మిగతా 23 ఫైర్ సర్వీసు ఉద్యోగాలు . ఈ జాబ్స్‌కు అప్లై చేసే వారి అర్హత ప్రమాణాలు ఇలా ఉండాలి. సెప్టెంబర్ 30, 2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు అయి ఉండాలి.

ఎస్సి /ఎస్టి , పిడబ్ల్యూడి/ఒబిసి తో పాటు ఇతర రిజర్వడ్ కేటగిరీల వారికి రిలాక్సేషన్ అలాగే ఉంటుంది. ఇక వివిధ పోస్టులకు పోస్టులను బట్టి విద్యార్హతలు ఉంటాయి.

సీనియర్ అసిస్టెంట్ (రాజ్‌భాష) ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (హ్యూమన్ రిసోర్స్) ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో 30 లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) జాబ్స్‌కు గ్రాడ్యుయేట్ అయి ఉండి సెప్టెంబర్ 30, 2022 నాటికి లైట్ మోటార్ వెహికల్లైసెన్స్ కలిగి ఉండాలి. మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా చేసిన వారు కూడా ఉద్యోగాలకు అర్హులు. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) ఖాళీలకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలీ కమ్యూనికేషన్ లేదా రేడియో ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు. సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. బీకామ్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సును 3 నుంచి 6 నెలల్లో పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై 3 సంవత్సరాల ఆటోమొబైల్ లేదా మెకానికల్ డిప్లొమా లేదా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అది కూడా రెగ్యులర్ అయి ఉండి, 12వ తరగతిలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఇతర ప్రయోజనాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ & రెగ్యులేషన్స్ ప్రకారం బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్, పెర్క్‌లు, హెచ్‌ఆర్‌ఏ, సిపిఎఫ్ , గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, మెడికల్ బెనిఫిట్‌లు మొదలైన ఇతర ప్రయోజనాలుంటాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులతో పోలిస్తే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వేతనం తక్కువగా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్), జూనియర్ అసిస్టెంట్ (హ్యూమన్ రిసోర్స్) ఉద్యోగాలకు నెలకు వేతనం రూ. 31,000-92,000 మధ్య ఉంటుంది

పూర్తి వివరాలకు www.aai.aero అభ్యర్థులు వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *