ఉద్యోగం కోల్పోయారా? అయితే మా కంపెనీకి రండి.

అమెరికాకు చెందిన పెద్ద కంపెనీలైన ట్విటర్, మెటా ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. యాపిల్‌, అమెజాన్, అల్ఫాబెట్‌ వంటి దిగ్గజ సంస్థల్లో కూడా నియామక ప్రక్రియ నెమ్మదించింది.

నైపుణ్యం  ఉన్న వారికి అవకాశాలకు కొదువ లేదు. ఒకప్పటిలాఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. టాలెంట్ (Talent)​ ఉంటే ఎన్నో అవకాశాలు మన కళ్ల ముందున్నాయి. మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా మన స్కిల్స్​ను మార్చుకుంటూ వెళ్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అయితే, ఇప్పుడు ఉన్న ఉద్యోగాల్లో చాలా వరకు అన్​సెక్యూర్​ జాబ్స్​. అంటే, కంపెనీ నష్టాల్లోకి వచ్చినా లేదా మీ పనితీరు నచ్చకపోయినా, మరే ఇతర కారణంతోనైనా మిమ్మల్ని ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా తొలగించే అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులు 60 రోజుల్లోగా మరో ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను కొనసాగించాలంటే వారు తప్పక ఉద్యోగం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో డ్రీమ్‌ 11 సహ వ్యవస్థాపకుడు హరీశ్‌ జైన్ ఇచ్చిన ఆఫర్ వైరల్‌గా మారింది.

‘అమెరికాలోఈ ఏడాది టెక్‌ సంస్థల్లో 52 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో భారతీయులు ఉంటే స్వదేశానికి తిరిగి రండి. మరీ ముఖ్యంగా వీసా సమస్యలు ఉన్నవారు ఇక్కడికొచ్చి భారత్‌ టెక్‌ రంగం అభివృద్ధికి పాటు పడండి. వచ్చే దశాబ్దంలో భారత్‌ టెక్‌ రంగంలో భారీ వృద్ధికి అవకాశం ఉంది. అలాగే, మా సంస్థ ఆర్థికంగా సుస్థిరంగా, లాభదాయంగా ఉంది. ఈ సంస్థలో ఉద్యోగం మీ అర్హతలకు తగినదని భావిస్తే.. సంకోచం లేకుండా సంప్రదించండి. డిజైనింగ్‌, ప్రొడక్ట్‌, టెక్ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారి కోసం మేం ఎదురుచూస్తున్నాం’ అని హరీశ్‌ జైన్ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ వేసే వారికి డ్రీమ్‌ 11 సుపరిచితమే. క్రికెట్‌ సహా హాకీ, ఫుట్‌బాల్‌, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ వంటి క్రీడలపై బెట్టింగ్‌ వేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తోంది. 2008లో ప్రారంభమైన ఈ కంపెనీ 2019లో యూనికార్న్‌ కంపెనీగా అవతరించింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *