అనిల్ అంబానీ కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న వ్యాపారవేత్త..! ఆ ఇంటి ధర 6000 కోట్లు!!

ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా అత్యంత ఖరీదైన ఇల్లు..
భారతదేశంలోని 11 అత్యంత ఖరీదైన ఇళ్ళు ప్రసిద్ధి.వాటి పేర్లు, ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్, సొగసైన ఇంటీరియర్‌లు, ప్రపంచ-స్థాయి సేవలు,7స్టార్‌ సౌకర్యాలను కలిగి ఉన్నాయి.

ఇవి ఆసియాలోని అత్యంత ధనవంతులైన వ్యక్తుల సొంతం. ఇంకా భారతదేశం 140 మంది బిలియనీర్లను కలిగి ఉన్న దేశం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద బిలియనీర్లను కలిగి ఉన్న దేశంగా గుర్తింపు ఉంది. భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరైన రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్నారు. అతని సోదరుడు అనిల్ అంబానీ ఇల్లు కూడా  అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలోకే వస్తుంది. కానీ దేశంలోని బిలియనీర్ వ్యాపారవేత్త ఇల్లు అనిల్ అంబానీ కంటే ఖరీదైనది. దాదాపు రూ. 12,000 కోట్ల విలువైన యాంటిలియా తర్వాత భారతదేశంలో అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో ఇది రెండవ స్థానంలో ఉంది

రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు

భారతదేశపు ప్రసిద్ధ ఫాబ్రిక్, ఫ్యాషన్ రిటైలర్ అయిన రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా JK ఇల్లు అనిల్ అంబానీ ఇంటి కంటే ఖరీదైనది. 145 మీటర్ల ఎత్తైన ఈ భవనం ముంబైలోని అల్టామౌంట్ రోడ్‌లో ఉంది. అంటే రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ఉన్న ప్రాంతంలోనే ఉంది.

దేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం!

గౌతమ్ సింఘానియా JK హౌస్ 30-అంతస్తుల భవనం. నివేదికల ప్రకారం..ఇది భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం. దీని ప్రతి అంతస్తు చాలా విలాసవంతమైనది. ఈ భవనంలో రెండు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్, స్పా, జిమ్, అనేక ఇతర వినోద సాధనాలు కూడా ఉన్నాయి. ఈ భవనంలో ఖరీదైన కార్లను పార్క్ చేసేందుకు ఐదు అంతస్తులు ఉన్నాయి.

దీని ధర దాదాపు 6 వేల కోట్ల రూపాయలు.

ముంబైలోని పాష్ ఏరియాలో ఉన్న ఈ ఆకాశహర్మ్యం విలువ దాదాపు రూ. 6,000 కోట్ల రూపాయలు. దీని పై అంతస్తులు వేర్వేరు నివాస రంగాలుగా విభజించబడ్డాయి. దాంతో వారి కుటుంబంలోని ప్రతి సభ్యుడు వారి వారి పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేసేలా ఉంది. ఇది కాకుండా, ప్రతి అంతస్తులో పచ్చని తోటలు పూల మొక్కల కోసం ప్రత్యేక స్థాన్ని కేటాయించారు. ఇది ప్రతి అంతస్తును అందంగా ఆకర్షణీయంగా మార్చేస్తుంది.

దీని వెనుక అనిల్ అంబానీ నివాసం..

అనిల్ అంబానీ నివాసం దీని వెనుకే ఉంది..అనిల్ అంబానీ ఇల్లు కూడా ప్యాలెస్ కంటే తక్కువేమీ కాదు. కానీ, అతని ఇంటి నివాసం ధర పరంగా మాత్రమే కాకుండా ఎత్తులో కూడా గౌతమ్ సింఘానియా ఇంటి తర్వాతే. ధర వ్యత్యాసం విషయానికి వస్తే…పాలి హిల్ ప్రాంతంలోని నర్గీస్ దత్ రోడ్‌లోని అనిల్ అంబానీ ఇల్లు, 17 అంతస్థుల విలాసవంతమైన భవనం, జేకే హౌస్ కంటే రూ. 1,000 కోట్లు తక్కువగా అంచనా వేస్తున్నారు. నివాసం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన భవనం. ఇందులో అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీలతో నివసిస్తున్నారు.

నివాసం వద్ద 7-నక్షత్రాల సౌకర్యాలు

అనిల్ అంబానీ కుటుంబానికి చెందిన ఈ ఇల్లు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 70 మీటర్ల ఎత్తులో ఉంది. జిమ్, స్పా, స్విమ్మింగ్ పూల్, ఇతర 7 స్టార్ సౌకర్యాలు ఈ విలాసవంతమైన భవనంలో ఉన్నాయి. అంబానీ కార్ల సేకరణను ప్రదర్శించడానికి పెద్ద లాంజ్ ఏరియా ఉంది. ఇంటి బాల్కనీ నుండి సూర్యోదయం,సూర్యాస్తమయం చూడవచ్చు. కుటుంబ సభ్యులు కూడా అద్భుతమైన సముద్రం అందాలను వీక్షించేందుకు వీలుగా ఉంటుంది. దేశంలోని టాప్-10 అత్యంత ఖరీదైన ఇళ్లలో అనిల్ అంబానీ నివాసం మూడో స్థానంలో ఉంది

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *