కళ్లేదుటే భార్య ఆత్మహత్య. కాపాడకపోగా వీడియో తీసిన భర్త

భార్య శోబితా ఆత్మహత్యను గమనించిన భర్త సంజయ్‌ ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. అలాగే భార్యను కాపాడకపోగా తన మొబైల్‌లో వీడియో రికార్డు చేశాడు.

లక్నో: ఒక వ్యక్తి భార్య అతడి కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది చూసి కూడా భర్త ఆమెను నిలువరించి కాపాడలేదు. పైగా భార్య ఆత్మహత్యను మొబైల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. అనంతరం భార్య ఆత్మహత్య విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సంజయ్ గుప్తా, శోబితా గుప్తాలకు ఐదేళ్ల కిందట వివాహమైంది. మంగళవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన శోబితా, భర్త సంజయ్‌ ఎదుటే ఆత్మహత్య చేసుకోసాగింది. బెడ్‌ రూమ్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.

మరోవైపు భార్య శోబితా ఆత్మహత్యను గమనించిన భర్త సంజయ్‌

ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. అలాగే భార్యను కాపాడకపోగా తన మొబైల్‌లో వీడియో రికార్డు చేశాడు. ఆమె చనిపోయిన విషయాన్ని అత్తింటి వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు.

కాగా, శోబితాకు సీపీఆర్‌ చేస్తున్న సంజయ్‌ను గమనించి అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుండగా రికార్డు చేసిన వీడియోను వారికి చూపించాడు. శోబితా తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో శోబితా కుటుంబ సభ్యులు సంజయ్‌ గుప్తాపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో భర్త క‍ళ్లేదుటే.. భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అదే తరహా ఘటన జరిగింది. వివరాలు.. రాజేంద్ర నగర్‌లో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎం.ఎం. పహాడీలో ఈ దారుణం చోటుచేసుకుంది. మద్యానికి అలవాటు పడిన భర్త సాజీద్‌ వేధింపులు తాళలేక భార్య షబానా బేగం అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాగా, ఆ వివాహిత.. భర్త కళ్లేదుటే.. తాను విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నాను.. నీవు ఇక నుంచి ప్రశాంతంగా ఉండు.. అంటూ భర్తతో చెప్పి పురుగుల మందు సేవించింది. అయితే, భార్యను కాపాడాల్సింది పోయి… సాజీద్‌ పైశాచికంగా ప్రవర్తించాడు. తన ముందే భార్య విషం తాగి గిల గిలా కొట్టుకుంటున్నా.. ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో పాపం.. ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. షబానా మృతితో ఆమె ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *