కరోనా తర్వాత వివిధ రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ పూర్తిగా మారింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరిగింది.
ఆసియా పసిఫిక్ రీజన్ కీలకంగా స్ట్రీమింగ్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ధరలు పెంచితే.. ఓటీటీ యూజర్ బేస్ లక్ష్యంగా నెట్ ఫ్లిక్స్ ధరలను భారీగా తగ్గించింది.
ఇప్పుడు ట్రెండ్ అంతా ఓటీటీనే ఆన్లైన్లోనే అన్నీ చూడొచ్చు.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌పై వెబ్ సిరీస్‌ల నుంచి టీవీషోలు, సినిమాలు.. ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలకు వేదికగా మారింది. కరోనా మహమ్మారి పుణ్యామాని ఓటీటీకి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ప్రతి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ ఫాం మరింత పుంజుకుంది. రానురాను ఓటీటీ కంటెంట్ వీక్షించే వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇప్పటివరకూ తక్కువ ధరకే వీడియో కంటెంట్ అందించిన స్ట్రీమింగ్ సర్వీసు కంపెనీలు ప్రీమియం ఛార్జీలను పెంచడం మొదలుపెట్టాయి. అందులో అమెజాన్ ప్రైమ్ ఒకటి అయితే.. రెండోది డిస్నీ+ హాట్ స్టార్ ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలు అమాంతం ధరలు పెంచేశాయి. దీనికి కారణం ఓటీటీలో పోటీనే చెప్పాలి. ఆసియా పసిఫిక్ రీజన్ కీలకంగా స్ట్రీమింగ్ కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. అందులో భారతీయ ఓటీటీ వినియోగదారులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి
ఓటీటీల కోసమే ప్రత్యేకంగా సిరీస్‌లు, సినిమాలు, ప్రత్యేక షోలు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆయా ఓటీటీ ప్లాట్‌ఫాంలు స్పెషల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. మొబైల్ ఓన్లీ ప్లాన్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, వాటి బెనిఫిట్స్ తెలుసుకుందాం
అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో కోసం మొబైల్-ఓన్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌గా పిలిచే ఈ ప్లాన్ రూ.599తో ఒన్ ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. మొబైల్ డివైజెస్‌లో సబ్స్క్రైబర్లకు మాత్రమే ప్రైమ్ వీడియో యాక్సెస్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఫ్రీ డెలివరీలు, అమెజాన్ మ్యూజిక్ మొదలైన ఇతర ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ అందవని గమనించాలి.
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ సహా అనేక రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. మొబైల్ ప్లాన్‌కు నెలకు రూ.149 చెల్లించాలి. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఎస్డి (480p) నాణ్యతలో అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్
డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ డివైజ్‌ల కోసం నెలవారీ, వార్షిక ప్లాన్లను అందిస్తుంది. దీని ధర మూడు నెలలకు రూ.149, సంవత్సరానికి రూ.499. ఈ రెండు ప్లాన్లు యాడ్-సపోర్టుతో వస్తాయి. ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ చేయగలరు.
వూట్ సెలెక్ట్ మొబైల్ ప్లాన్
వూట్ సెలెక్ట్ సంవత్సరానికి రూ.299తో ఒక మొబైల్ ప్లాన్‌ను మాత్రమే అందిస్తోంది. ఒక డివైజ్‌లో 720p స్ట్రీమింగ్‌ను మాత్రమే అవకాశం ఉంటుంది.
సోనీలైవ్ మొబైల్ ప్లాన్
సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సంవత్సరానికి రూ.599తో ఉంది. ఇది ఒక మొబైల్ డివైజ్‌లో మాత్రమే 720p స్ట్రీమింగ్కు అవకాశం ఇస్తుంది.
డిస్కవరీ+
డిస్కవరీ+ కేవలం రెండు ప్లాన్లను మాత్రమే అందిస్తుంది. రూ.199కి మంత్లీ ప్లాన్, రూ.399కి యాన్యువల్ ప్లాన్ అందుబాటులో ఉన్నాయి.
ఈరోస్ నౌ
Eros Now ఎలాంటి మొబైల్ ప్లాన్‌ను అందించదు. ఈ ప్లాట్‌ఫామ్ వరుసగా రూ.49, రూ.79, రూ.399 ధరలతో మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్లను మాత్రమే అందిస్తుంది.
జియో ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ
జీ5
జీ5లో మొబైల్- ఓన్లీ ప్లాన్ అందుబాటులో లేదు. ఇది వరుసగా రూ.999, రూ.399 ధరలతో యాన్యువల్, క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది.