కొత్త ఫోన్ కొన్నారా.వాట్సాప్ ఓల్డ్ చాట్స్‌ను కొత్త ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా.

వాట్సాప్ ప్రతి ఇంటర్నెట్ యూజర్ జీవితంలో కీలకమైన భాగమైపోయింది.

స్నేహితులు, బంధువులు, రిలేటివ్స్, తెలిసినవారు, కొలీగ్స్ ఇలా అందరితో టచ్‌లో ఉండటానికి చాలామంది వాట్సాప్‌ పైనే ఆధారపడుతున్నారు. 

అయితే కొత్తగా ఫోన్ కొనుగోలు చేసినప్పుడు పాత ఫోన్‌లోని వాట్సాప్ డేటాను మూవ్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రాసెస్ కొందరికి తెలియకపోవచ్చు. అలాంటి వారికోసం.. వాట్సాప్ చాట్స్, గ్రూప్ చాట్స్‌, మెసేజ్ హిస్టరీ, మీడియా, సెట్టింగ్స్‌ను ఓల్డ్ ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో చూద్దాం. 

* ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌
ప్రక్రియను ప్రారంభించే ముందు మీ ఓల్డ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని మొత్తం వాట్సాప్ డేటాను మీ గూగుల్ డ్రైవ్‌కు బ్యాకప్ చేయాలి. అందుకు ఓల్డ్ ఫోన్‌లోని వాట్సాప్> మోర్ ఆప్షన్స్ > సెట్టింగ్స్‌ > చాట్స్ > చాట్ బ్యాకప్ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి. 

స్టెప్ 2: మీరు మీ చాట్స్‌ను బ్యాకప్ చేయాలనుకుంటున్న గూగుల్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీ వాట్సాప్ డేటా బ్యాకప్ సేవ్ అయిన గూగుల్ అకౌంట్‌ లింక్ చేయాలి. మీ కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ ఇన్‌స్టాల్ చేసి, సైన్ ఇన్ చేయాలి అప్పుడు గూగుల్ డ్రైవ్ నుంచి మీ చాట్స్‌, మీడియాను రిస్టోర్ చేయాల్సిందిగా ఓ ప్రాంప్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. ‘రిస్టోర్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నెక్స్ట్ బటన్‌పై నొక్కాలి. ఇనిషలైజేషన్ పూర్తయిన తర్వాత మీ ఓల్డ్ చాట్స్‌ కనిపిస్తాయి.

మీ చాట్స్ రిస్టోర్ అయ్యాక వాట్సాప్ మీ మీడియా ఫైల్స్‌ను రిస్టోర్ చేయడం పూర్తి చేస్తుంది 

మీ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లో ప్లే స్టోర్ నుంచి “మూవ్ టూ ఐఒఎస్” యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఆపై యాప్ లాంచ్ చేసి స్క్రీన్‌పై ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. స్క్రీన్ ప్రాంప్ట్ కాగానే ఐఫోన్‌లో కనిపించే కోడ్‌ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎంటర్ చేయాలి 

ట్రాన్స్‌ఫర్ డేటా స్క్రీన్‌పై ‘వాట్సాప్’ని సెలెక్ట్ చేసుకుని, స్టార్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. వాట్సాప్ ఎక్స్‌పోర్ట్ కోసం డేటాను సిద్ధం చేస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత సైన్ అవుట్ చేయాలి. ఐఫోన్‌కి డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ‘మూవ్ టుఐఒఎస్’ అప్లికేషన్‌కి వెళ్లి, ‘కంటిన్యూ’పై నొక్కాలి. డేటా ట్రాన్స్‌ఫర్ పూర్తయిన తర్వాత, మీ ఐఫోన్‌లో లేటెస్ట్ వాట్సాప్ యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. 

ఓల్డ్ iOS ఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్
యూఎస్బి టైప్-సీ టు లైటనింగ్ కేబుల్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ డివైజ్‌ను ఐఫోన్‌కి కనెక్ట్ చేయాలి. మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీ ఐఫోన్‌లో QR కోడ్‌ని స్కాన్ చేయడానికి.. సెట్టింగ్స్‌> చాట్స్‌> మూవ్ చాట్స్ టు ఆండ్రాయిడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ సమయంలో ఫోన్‌ని అన్‌లాక్ చేసి ఉంచాలి.

యాప్ బ్యాకప్‌ని పూర్తి చేసిన తర్వాత ‘స్టార్ట్ ట్రాన్స్‌ఫర్’పై క్లిక్ చేయాలి. మీ చాట్స్‌, ఫొటోలు, ఇతర డేటా మీ కొత్త ఆండ్రాయిడ్ డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ట్రాన్స్‌ఫర్ అయ్యే సమయంలో రెండు డివైజ్‌లు ఇతర టాస్కుల కోసం వాడకూడదు

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *